అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ (ADAG)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసి విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ భావిస్తోంది. ADAG గ్రూప్‌కు ఢిల్లీలోపవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉంది. BSES రాజ్‌ధాని పవర్ లిమిటెడ్ (BRPL), BSES యమనా పవర్ లిమిటెడ్ (BYPL) పేరుతో రెండు సంస్థలు ఉన్నాయి. ఎన్టీపీసీ ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థ కాబట్టి వీటిలో 51 శాతం వాటాను కొనుగోలుకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆస్తులు కొనేందుకు ఆసక్తి
ఈ మరకు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC)కు మే 26వ తేదీన ఎన్టీపీసీ లేఖ రాసింది. 'విద్యుత్ పంపిణీ రంగంలోకి అడుగు పెట్టాలని ఎన్టీసీపీ నిర్ణయించిందని, విద్యుత్ పంపిణీలో ఉన్న అసెట్స్‌ను (BRPL, BYPL) కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. 'BRPL, BYPLలోని 51 శాతం వాటాలను విక్రయించాలని అనిల్ అంబాని గ్రూప్ భావిస్తున్నట్లుగా మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నాం' అని పేర్కొంది.

కొన్నాళ్లుగా అమ్మకంపై వార్తలు
ఈక్విటీ అమ్మకం పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగితే అమ్మకానికి ఉన్న BRPL, BYPLలలో 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎన్టీపీసీ ఆసక్తిగా ఉన్నదని కంపెనీ తెలిపింది. కాగా, అనిల్ అంబానీకి చెందిన విద్యుత్ ప్లాంట్స్ విక్రయంలో భాగంగా బయ్యర్స్‌ను గుర్తించేందుకు ఇప్పటికే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్... KPMGని నియమించుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఈ రెండు విద్యుత్ పంపిణీ వ్యాపారాలు దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 4.4 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి.

గతంలోనే వివిధ కంపెనీల ఆసక్తి
అనిల్ అంబానీకి చెందిన ఈ ఢిల్లీ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అమ్మకానికి ఉండటంతో ఎన్టీపీసీ కంటే ముందే మరో 8 మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. క్యాస్ డీ డీపోట్ (CDPQ), యాక్టిస్ ఎల్ఎల్‌పీ అండ్ బ్రూక్‌ఫీల్డ్స్ అసెట్ మేనేజ్‌మెంట్ సహా వివిధ సంస్థలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన ఢిల్లీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్బిజినెస్ కొనుగోలుకు ఆసక్తిని ప్రదర్శించాయి. అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన రుణాలు తగ్గించుకోవడం కోసం ఆస్తులు విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications