For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్వెస్టర్లూ.. అప్రమత్తంగా ఉండండి.. మీకోసం NSE ఇచ్చిన సలహాలు తెలుసా?

|

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లో వెలుగు చూసిన తాజా ఉదంతం నేపథ్యంలో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లు తమ షేర్లు ఏమవుతాయోనని కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ షేర్లను సంరక్షించు కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) కొన్ని సలహాలను విడుదల చేసింది. వీటిని పాటించడం ద్వారా ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.

అవేమిటంటే...

* ఇన్వెస్టర్లు తమకు నిర్దేశిత సమయంలో చెల్లింపులు జరిగాయా లేదా అన్నది చూసుకోవాలి.

* ఫండ్స్ లేదా సెక్యూరిటీలకు చెల్లింపులు చేసినప్పుడు ఒక పని దినంలో మీ ఖాతాలోకి అవి వచ్చాయో లేదో చూసుకోండి.

* పవర్ అఫ్ అటార్నీ(పీఓఏ) నిర్వహణ విషయంలో ఇన్వెస్టర్లు జాగరూకతతో ఉండాలని ఎన్ఎస్ఈ పేర్కొంది.

ఇన్వెస్టర్లూ.. జాగ్రత్త: మీకోసం NSE ఇచ్చిన సలహాలు తెలుసా?

* బ్రోకర్లకు తప్పని సరిగా పీఓఏ కల్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పీఓఏ కల్పిస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ సెక్యూరిటీలపై బ్రోకర్ కు ఎలాంటి అధికారాలను కట్టబెడుతున్నది పీఓఏ పత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. ఈ పీఓఏ ఎంతకాలం పాటు చెల్లు బాటు అవుతుందనేది ప్రస్తావించాలి.

* మార్జిన్ల కోసం ఖాతాదారులు ఇచ్చే షేర్లను తాకట్టు పెట్టడానికి వీలులేదు.

* స్టాక్ బ్రోకర్లు ఎప్పటికప్పుడు తమ ఖాతాను సెటిల్ చేస్తున్నాయా లేదా అని డీమ్యాట్ ఖాతాదారులు గమనించాలి.

* ఖాతాదారులు తమ సొమ్మును లేదా షేర్లను ఎక్కువ కాలం స్టాక్ బ్రోకర్ల వద్ద ఉంచరాదు. ఇలాంటి వాటిని వాడుకునే అవకాశం ఉండవచ్చు.

* ఖాతాదారులు తరచుగా తమ అకౌంట్ లోకి లాగిన్ అయి బ్యాలెన్స్ ను , డిపాజిటరీలు పంపే డీమ్యాట్ స్టేట్ మెంట్ ను చూసుకోవాలి.

* తమ ఖాతాదారుల అకౌంట్లలోని నిధులు, సెక్యూరిటీల గురించి బ్రోకర్లు, రిపోర్ట్ చేసిన వివరాలను స్టాక్ ఎక్స్చేంజ్ లకు తిరిగి ట్రేడర్లకు పంపుతాయి. మీ ఖాతా బ్యాలెన్స్ ను స్టాక్ ఎక్స్చేంజ్ లు పంపిన సమాచారంతో సరి చూసుకోండి. ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి.

* డీమ్యాట్ ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్, ఈ- మెయిల్ ఐడీ వివరాలను బ్రోకర్ వద్ద అప్డేట్ చేయాలి.

* స్టాక్ ఎక్స్చేంజ్ లేదా డిపాజిటరీ నుంచి మెసెజ్ లు రాకపోతే స్టాక్ బ్రోకర్ లేదా ఎక్స్చేంజ్ కు తెలియజేయాలి.

* మీ ఖాతాలో లేదా సెటిల్ మెంట్లలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే మీ బ్రోకర్ కు ఆ వివరాలు తెలియజేయాలి. వారి నుంచి తగిన స్పందన లభించక పోతే స్టాక్ ఎక్స్చేంజ్, డిపాజిటరీ లను ఆశ్రయించాలి.

ఎయిర్‌టెల్ ఇకపై విదేశీ సంస్థ... ఎందుకంటే?

కార్వీపై చర్యలివి..

* రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు కార్వీని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు సస్పెండ్ చేశాయి. సోమవారం నుంచి ఇది అమల్లోకి వస్త్తుంది. కొత్త క్లయింట్లను తీసుకోకుండా గత నెలలో కార్వీనీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నిషేదించింది. పవర్ అఫ్ అటార్నీని వినియోగించకుండా నిరోదించింది. క్లయింట్ల సెక్యూరిటీలను ఈ సంస్థ దుర్వినియోగం చేసిందని సెబీ గుర్తించింది. కంపెనీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఇన్వెస్టర్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి ఈ కంపెనీ 600 కోట్ల అప్పు తీసుకుంది.

English summary

NSE issues advisory for the investors

Karvy stock Broking case has increased tension in the stock market investors. in this context National stock exchange has issued advisory for investors to protect their money. NSE has asked stock market investors to verify balances and verify the demat statement received form depositories for correctness
Story first published: Tuesday, December 10, 2019, 13:58 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more