పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తైతే.. ఆ వచ్చిన లాభాలపై పన్ను ఆదా చేయడం మరో ఎత్తు. తాజాగా ముంబైకి చెందిన ఒక ఎన్‌ఆర్‌ఐ (NRI) మహిళ మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ (mutual fund tax) విషయంలో సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.1.35 కోట్ల ఆదాయంపై ఒక్క రూపాయి కూడా భారత్‌లో పన్ను కట్టక్కర్లేదని ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) తీర్పునిచ్చింది. అసలు ఆదాయపు పన్ను శాఖ నోటీసును ఆమె ఎలా ఎదుర్కొంది? "సింగపూర్ - ఇండియా" ఒప్పందం ఆమెను ఎలా కాపాడింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేసు నేపథ్యం ఇదే!
ముంబైకి చెందిన ఒక మహిళ సింగపూర్‌లో నివసిస్తూ అక్కడి ట్యాక్స్ రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె భారత్‌లోని ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా రూ.1.35 కోట్ల షార్ట్ టర్మ్ లాభాలను (Short-term Capital Gains) పొందారు. ఇందులో రూ.88 లక్షలు డెట్ ఫండ్స్ ద్వారా, రూ.46 లక్షలు ఈక్విటీ ఫండ్స్ ద్వారా వచ్చాయి. ఇండియా-సింగపూర్ మధ్య ఉన్న 'డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్' (DTAA) ప్రకారం.. ఈ లాభాలపై భారత్‌లో పన్ను కట్టక్కర్లేదని ఆమె తన ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్నారు.
ఐటీ శాఖ అభ్యంతరం
ఆమె రిటర్న్స్‌ను పరిశీలించిన ఆదాయపు పన్ను శాఖ అధికారి ఆ క్లెయిమ్‌ను తిరస్కరించారు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి భారతీయ ఆస్తుల నుంచే విలువను పొందుతాయి. కాబట్టి ఆ లాభాలపై భారత్‌లోనే పన్ను కట్టాలని నోటీసు ఇచ్చారు. దీనిపై ఆమె డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP)కు వెళ్లినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె ముంబైలోని ఐటీఏటీని ఆశ్రయించారు.
మ్యూచువల్ ఫండ్ యూనిట్లు 'షేర్లు' కావు!
ఈ కేసులో ప్రధాన వాదన అంతా "షేర్లు" (Shares), "మ్యూచువల్ ఫండ్ యూనిట్ల" (Units) చుట్టూ తిరిగింది.
- ఒప్పందంలోని ఆర్టికల్ 13(4): కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై భారత్‌లో పన్ను వేయవచ్చని చెబుతుంది.
- ఆర్టికల్ 13(5): షేర్లు కాకుండా ఇతర ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై కేవలం సదరు వ్యక్తి నివసిస్తున్న దేశం (సింగపూర్)లోనే పన్ను వేయాలని చెబుతుంది.
ట్రిబ్యునల్ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించింది. సెబీ (SEBI) నిబంధనల ప్రకారం భారత్‌లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి 'ట్రస్టుల' ద్వారా నడుస్తాయి, కంపెనీల ద్వారా కాదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు షేర్లతో సమానం కావు. దీనివల్ల ఈ లాభాలు ఆర్టికల్ 13(5) కిందకు వస్తాయి తప్ప, 13(4) కిందకు రావు.
దుబాయ్ కేసుతో లింక్..
గతంలో యూఏఈ (UAE) లో ఉంటున్న ఒక వ్యక్తి విషయంలో కూడా కొచ్చి ఐటీఏటీ ఇలాంటి తీర్పే ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు షేర్లు కావు. కాబట్టి భారత్‌లో వాటికి పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అదే సూత్రాన్ని ముంబై ఐటీఏటీ ఈ మహిళ కేసులోనూ వర్తింపజేసింది. ఫలితంగా ఆమె సంపాదించిన రూ.1.35 కోట్లపై భారత్‌లో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
పెట్టుబడిదారులకు పాఠం
ఈ తీర్పు ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే కాదు, పన్ను నిబంధనలపై అవగాహన ఉన్న సామాన్య పెట్టుబడిదారులకు కూడా ఒక గొప్ప పాఠం. ప్రభుత్వం లేదా ఐటీ శాఖ నోటీసు ఇచ్చినప్పుడు.. సరైన చట్టబద్ధమైన ఒప్పందాలను (DTAA వంటివి) చూపగలిగితే భారీగా పన్ను ఆదా చేసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications