భారత్ నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లినవారు ముందుగా చెప్పేమాట..లక్షల్లో జీతాలు తీసుకుంటున్నాం అని.. అయితే వారు నిజంగా లక్షల్లో జీతాలు తీసుకుంటుంటే అవి అక్కడ వారికి సరిపోతున్నాయా అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిఉండవచ్చు. వారు అమెరికాలో ఎన్నిలక్షలు సంపాదించినా అక్కడ ఖర్చులతో పోలిస్తే ఆ జీతాలు ఓ మూలకు కూడా రావు. ఈ విషయాన్ని ఓ ఉద్యోగి తన సోషల్ మీడియా ఫ్లాట్ పాంలో నెటిజన్లతో పంచుకున్నాడు.
శుభం చక్రవర్తి అనే యూజర్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పోస్టు ప్రకారం.. మీ మిత్రుడు అమెరికాలో రూ. 80 లక్షల వేతనం పొందుతున్నానంటే, అతని జీవితం లాగే మీరు భారత్‌లో అనుభవించాలంటే మీకు కేవలం రూ. 23 లక్షలే చాలని తెలిపారు. ఇదే Purchasing Power Parity గొప్పతనమని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన సూత్రం ప్రకారం.. PPP అనేది ఒక దేశంలో డబ్బుతో ఏం కొనగలమో అదే మరో దేశంలో కొనవచ్చు. అయితే అక్కడ ఇక్కడా ఖర్చులో తేడా ఉంటుంది. దీన్నిఆర్థిక సూత్రం అంటారని చెప్పుకొచ్చారు.

అయితే ఇది కరెన్సీ మార్పిడి కాకుండా ఆ దేశంలో లివింగ్ కాస్ట్, ఫుడ్, ఇంటర్నెట్ బిల్లు, ఇంటి అద్దె వంటి వాటి ఆధారంగా నిర్ణయించబడుతుందని తెలిపారు. ఉదాహరణకు, భారత్‌లో రూ. 300 ఖర్చుతో మంచి భోజనం చేస్తే...అమెరికాలో అదే భోజనానికి రూ. 1,700 ఖర్చు అవుతుంది. ఇక ఇంటర్నెట్ బిల్ ఇక్కడ రూ. 700 ఉంటే అమెరికాలో రూ. 6,000కి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఇండియాలో రూ. 50,000 రెంటుకు ఉండే ఇల్లు అక్కడ కాస్తా రూ. 1.6 లక్షలు అయ్యే అవకాశముందని రాసుకొచ్చారు.
అయితే దీనితో పాటుగా ఈ PPPకు పరిమితులు ఉన్నాయని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మంచి వసతులు అలాగే పబ్లిక్ సర్వీసులు, టెక్నాలజీ, భద్రత వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కావున, ఉద్యోగ ఆఫర్లు తీసుకునే ముందు వేతనం మాత్రమే కాకుండా అక్కడ జీవనశైలితో పాటు భవిష్యత్ వ్యూహాలు, కుటుంబ అవసరాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని పోస్టులో సూచించారు.ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. విదేశాల్లో జీతాలు ఎక్కువగా అనిపించినా అక్కడి జీవన వ్యయం, పన్నులు, హెల్త్ ఇన్సూరెన్స్, పిల్లల చదువు వంటి అంశాలు చాలా ఖరీదైనవిగా మారతాయని చెబుతున్నారు.
ఏదేమైనా విదేశాల్లో జీతాలు చాలా ఎక్కువగా అనిపించవచ్చు కాని అక్కడి జీవన విధానానికి ఆ జీతాలు సరిపోతాయా లేదా అనేది అర్థం చేసుకోవడం చాలా అవసరం.. ఒక్క జీతాలతోనే విదేశాల ప్రయాణాలు పెట్టుకోవద్దు.. ఆదాయాన్ని సేవింగ్స్‌గా మార్చుకునే అవకాశాల గురించి కూడా ఆలోచించుకోవాలి. కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా చూసుకోవాలి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications