సింగపూర్ NRI సంచలనం! రూ. కోటిన్నర లాభం వచ్చినా జీరో టాక్స్! కొత్త టాక్స్ రూల్స్‌లో ఉన్న ట్విస్ట్ ఇదే!

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ప్రవాస భారతీయులకు (NRIs) ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒక సింగపూర్ ఎన్నారై మహిళ ఇండియాలోని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏకంగా రూ. 1.35 కోట్ల లాభం (Capital Gains) సంపాదించినా.. దానికి రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ITAT) సంచలన తీర్పునిచ్చింది. ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ టాక్స్ మినహాయింపును తిరస్కరించినప్పటికీ, కోర్టు మాత్రం సదరు మహిళకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

NRI makes Rs 1 35 crore gains from mutual funds in India pays zero tax rules

అసలు ఈ వివాదం ఏంటి?

అనుష్క సంజయ్ షా అనే సింగపూర్ టాక్స్ రెసిడెంట్, అసెస్‌మెంట్ ఇయర్ 2022-23కు గాను ఇండియాలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఆ సమయంలో ఆమె డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ. 88.75 లక్షలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ. 46.91 లక్షలు.. మొత్తంగా రూ. 1.35 కోట్ల షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంపాదించారు.

అయితే ఇండియా-సింగపూర్ మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ అవా‌యిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) ఒప్పందం ప్రకారం.. తాను సింగపూర్‌లో టాక్స్ కడుతున్నందున, ఇండియాలో ఈ లాభాలపై పన్ను కట్టాల్సిన అవసరం లేదని (ఎగ్జెంప్షన్) ఆమె వాదించారు. కానీ భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు (AO) , డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) దీనికి ఒప్పుకోలేదు. ఇండియాలోని అసెట్స్ ద్వారా వచ్చిన లాభం కాబట్టి టాక్స్ కట్టాల్సిందేనంటూ రూ. 1.35 కోట్లకూ పన్ను విధిస్తూ ఆర్డర్ వేశారు. దీంతో ఆమె ఐటీఏటీ (ITAT) ని ఆశ్రయించారు.

కోర్టులో తేలిన కొత్త టాక్స్ రూల్స్ (tax rules)

ఈ కేసులో ఐటీఏటీ ముంబై బెంచ్ ఒక అద్భుతమైన పాయింట్‌ను తెరపైకి తెచ్చింది. ఇండియా-సింగపూర్ ఒప్పందంలో 'షేర్ల' అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై టాక్స్ రూల్స్ వేరుగా ఉన్నాయి. అయితే ఐటీ శాఖ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా షేర్ల లాగే భావించి పన్ను వేసింది. కానీ, కోర్టు దీనిని తప్పుపట్టింది.

"మ్యూచువల్ ఫండ్స్ అనేవి కంపెనీలు కావు, అవి ఒక ట్రస్ట్ తరహాలో నడుస్తాయి. షేర్లు కొంటే కంపెనీలో ఓటింగ్ హక్కులు, యాజమాన్య భాగస్వామ్యం వస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొంటే కేవలం పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో లాభాల హక్కు మాత్రమే వస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కంపెనీ షేర్లను ఒకేలా చూడలేం" అని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఒప్పందంలోని ఆర్టికల్ 13(5) ప్రకారం.. ఇలాంటి ఇతర అసెట్స్ ద్వారా వచ్చే లాభాలపై పన్ను వసూలు చేసే హక్కు సదరు ఇన్వెస్టర్ నివసించే దేశానికే (సింగపూర్) ఉంటుందని తీర్పునిచ్చింది.

ఎన్నారైలకు ఇది ఎందుకు పెద్ద లాభం?

ఈ తీర్పు సింగపూర్‌లో ఉండే భారతీయ ఇన్వెస్టర్లకు ఒక బూస్ట్ లాంటిదని టాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, సాధారణంగా సింగపూర్ దేశంలో క్యాపిటల్ గెయిన్స్ (పెట్టుబడి లాభాల) పై ఎలాంటి పన్నులు ఉండవు. ఇప్పుడు ఈ కొత్త టాక్స్ రూల్స్ (tax rules) వివరణ ప్రకారం చూస్తే.. సింగపూర్ ఎన్నారైలు భారతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలపై అటు ఇండియాలోనూ, ఇటు సింగపూర్‌లోనూ పన్ను కట్టాల్సిన పని ఉండదు. అంటే లీగల్‌గానే రెండు దేశాల్లోనూ 'జీరో టాక్స్' బెనిఫిట్ పొందే అవకాశం లభిస్తుందన్నమాట. అయితే ఈ రూల్ కేవలం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది, డైరెక్ట్ ఈక్విటీ షేర్లకు వర్తించదని గుర్తుంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+