ఈ మధ్య కాలంలో దేశం నుంచి వలస వెళ్లిన వారి ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. వారంతా విదేశాలను వదిలి మాతృభూమిపై మమకారం పెంచుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు (విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు) పెద్ద ఎత్తున తిరిగి పుట్టిన భూమి భారత్‌కు వస్తున్నారు. అయితే ఇది కేవలం ఉద్యోగం లేక డబ్బు కోసం మాత్రం కాదు. వారంతా వ్యక్తిగతంగా, భావోద్వేగపూరితంగా, ఈ దేశ సంస్కృతి పట్ల ప్రేమతో మళ్లీ స్వదేశానికి వెళ్లాలనే ఆలోచన వారిలో కనిపిస్తోంది.
భారతీయులకు కుటుంబం అనేది చాలా ముఖ్యమైనదిగా జీవిస్తుంటారు. ఓ సర్వే ప్రకారం, 75% ఎన్ఆర్ఐలు భారత్ లో ఉన్న తమ బంధువుల వద్దకు తిరిగి వస్తున్నారని తెలిపింది. దీనికి ప్రధాన కారణం వారిలో పురుడు పోసుకున్న కుటుంబ సంబంధాలేనని సర్వే చెబుతోంది. ఇక్కడ వివాహాలు, పుట్టినరోజులు, పండుగలు ఒకే కుటుంబం జరుపుకునేవి కావు.

కుటుంబ సభ్యులు బంధువులతో పాటు చుట్టుపక్కల అందరితో కలిపి జరుపుకునే పండుగ. అయితే విదేశాల్లో ఉంటే అలాంటిదేమి ఉండదు. ఇవన్నీ వారు ఒంటరిగానే జరుపుకోవాలి. మన దేశంలో అయితే దీపావళి, హోలీ, సంక్రాంతి వంటి పండుగలు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడమే గొప్ప అనుభూతి. అయితే విదేశాల్లో ఆ అవకాశం లేకపోవడంతో చాలామంది తిరిగి తమ సొంత దేశానికి తిరిగి వస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే.. కుటుంబం మధ్య తమ జీవితాన్ని గడిపాలనే ఆకాంక్షతో 2022లోనే 8 మిలియన్లకు పైగా ఎన్ఆర్ఐలు భారత్‌కు తిరిగి వచ్చారు. 2022లో తిరిగివచ్చిన ఎన్ఆర్ఐ కుటుంబాలలో 72% మంది ఇక్కడ పిల్లల పెంపకానికి మంచి వాతావరణం ఉందని పేర్కొన్నారు. పిల్లలు తాతయ్యలు, నానమ్మలతో గడిపే సమయం వాళ్లను మన సంస్కృతిలో భాగమయ్యేలా చేస్తోందని..అదే విదేశాల్లో ఉంటే వారికి ఇలాంటివేమి తెలియవని అన్నారు.
విదేశాల్లో ఉంటే పిల్లల పెంపకం, పనులు, ఉద్యోగం అన్నీ తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిగా మారుతాయి. అయితే భారత్‌లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటం వల్ల సహాయం, ఆదరణ అనేది లభిస్తుంది. అమ్మమ్మో, తాతయ్యో, అత్తో ఎవరో ఒకరు వారి ఆలనాపాలనా చూస్తారు. పెద్దల సహకారం, డొమెస్టిక్ హెల్ప్, బాబాయ్, మామయ్య, అమ్మమ్మ లాంటి బంధాలు పిల్లలకి ఆత్మీయతను నేర్పుతాయని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు.
మరో విషయం ఏంటంటే.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా ఎదుగుతోంది. 2023లో 7.2% వృద్ధి తో ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. టెక్నాలజీ, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో అనుభవం ఉన్నవారు ఇక్కడ కెరీర్‌లో ఉన్నతస్థానాన్ని అందుకోవచ్చు. ఇప్పటికే 35% మంది ఎన్ఆర్ఐలు ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలున్నాయనే కారణంతోనే తిరిగి వచ్చారు. ఇంకా ముందకు వెళితే విదేశాలకు వెళ్లిన చాలా కుటుంబాలు స్వంతంగా వ్యాపారం ప్రారంభించడానికే భారత్‌కు తిరిగి వస్తున్నారు.
విదేశాల్లో ఉన్నప్పుడు, ఎంతో మంది భారతీయులు ఇక్కడి సంస్కృతిని, పండుగలను పూర్తిగా మరచిపోతున్నారు. దీపావళి, వినాయక చవితి, నవరాత్రులు వంటి పండుగలు అక్కడ ఎటువంటి సందడి లేకుండానే గడిపేయాల్సి వస్తోంది.అయితే ఇక్కడ పండుగల సందడి, గుడి పూజలు, సామూహిక ఉత్సవాలు మనం అసలైన భారతీయులమనే భావనను కలిగిస్తున్నాయి.దీంతో వారు స్వదేశానికి రావడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications