మీరు ప్రతి ఏడాది మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. ట్యాక్స్ పేయర్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక కొత్త ఫెసిలిటీ ప్రవేశపెట్టింది. ఏంటంటే పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ పేమెంట్ ఈజీ చేయడానికి అఫీషియల్ ఆన్‌లైన్ పోర్టల్‌లో 'ఇ-పే టాక్స్' ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. దీని ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ సులభంగా ఇంకా వేగంగా చేస్తుంది.

క్యూలైన్లో లేదా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు: ఈ ఫీచర్'తో ప్రజలు ఇకపై పన్ను చెల్లించడానికి క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేదు ఇంకా బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండదు. కష్టపడి ఫామ్ నింపడం, చివరి నిమిషంలో పన్ను చెల్లించాలనే హడావిడి కూడా ఉండదు. పన్ను చెల్లింపుల పద్ధతుల గ్రహించి డిజిటల్ దిశగా మరో అడుగు వేస్తూ ఆదాయపు పన్ను శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో 'ఇ-పే టాక్స్' సౌకర్యాన్ని తాజాగా ప్రారంభించింది.
'ఇ-పే టాక్స్' అంటే ఏమిటి: 'ఇ-పే టాక్స్' అనేది ఒక డిజిటల్ ఫెసిలిటీ, దీని ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించవచ్చు. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మాట్లాడుతూ 'ఈ ఫెసిలిటీ చాలా ఈజీ, వేగంగా ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని వల్ల పన్నులు చెల్లించే పని సులభం అవుతుంది. ఇంకా ప్రజలు ఇంట్లో కూర్చొని కూడా పన్నులు కట్టొచ్చు. దీని కోసం పాన్ నంబర్,
ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఉంటే చాలు. లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదు.
ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే : 'ఇ-పే టాక్స్' ఉపయోగించడం చాలా సులభం. ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ incometax.gov.in ని ఓపెన్ చేయాలి. అక్కడ 'e-pay tax' అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ పన్ను మొత్తాన్ని చెల్లించవచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, NEFT / RTGS లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా కూడా చెల్లించవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకు చలాన్ రిసిప్ట్ కూడా వస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ద్వారా మీరు అన్ని రకాల పన్నులు చెల్లించవచ్చు.
'ఇ-పే టాక్స్' వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఈ సమయాన్ని ఆదా చేస్తుంది అంతేకాక ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియను మరింత స్పష్టంగా చేస్తుంది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు, సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రజలు టైంకి పన్ను చెల్లించేలా ప్రోత్సహిస్తుందని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది.


Click it and Unblock the Notifications