గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవో నార్డిస్క్ (Novo Nordisk, NOVOb.CO) బరువు తగ్గించే ఔషధం వెగోవీ (Wegovy) తయారీదారుగా ప్రఖ్యాతి పొందిన సంగతి విదితమే. అయితే ఇటీవల ఈ సంస్థ 9 వేల ఉద్యోగాలను కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కీలక నిర్ణయం సంస్థ తన వ్యాపార మోడల్‌ను సరళీకృతం చేసి, మధుమేహం, ఊబకాయం చికిత్సల వ్యూహానికి దృష్టి సారించేందుకు, అలాగే అమెరికా ప్రధాన ప్రత్యర్థి ఎలి లిల్లీ (Eli Lilly, LLY.N) తో తీవ్ర పోటీ ఎదుర్కొనడాన్ని తగ్గించేందుకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
2021లో వెగోవీ అమెరికాలో ఆమోదించబడిన తర్వాత.. నోవో నార్డిస్క్ నిరంతర వృద్ధిని సాధించింది. ఆ ఉత్పత్తి కారణంగా నోవో యూరోపియన్ స్టాక్ మార్కెట్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే, ఐదు సంవత్సరాల వ్యవధిలో భారీగా నియామకాలు పెరిగిన తరువాత నిర్ణయం మార్చుకుంది. తాజా నిర్ణయం ద్వారా 8 బిలియన్ డానిష్ క్రౌన్లు 1.25 బిలియన్ డాలర్లు) సంవత్సరానికి ఆదా చేయాలని కంపెనీ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది నోవో మూడో లాభ హెచ్చరికను కూడా జారీ చేసింది. మైక్ డౌస్ట్‌డార్‌ను కొత్త CEOగా నియమించిన తరువాత, కంపెనీ మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో షేర్లు దాదాపు 46 శాతం పడిపోగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 181 బిలియన్ డాలర్లకు చేరింది.
నార్డియా బ్యాంక్ ఇక్విటీ విశ్లేషకుడు మైఖేల్ నోవోడ్ ప్రకారం.. ఈ చర్య సంస్థకు వనరులను ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం పెరుగుదల విభాగాలకు మళ్లించడంలో, మార్జిన్‌లు పెంచడంలో, ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ATG హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ లుకాస్ ల్యూ ఇది పెట్టుబడిదారులకు అసంతృప్తికర నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
నోవో ప్రస్తుతం GLP-1 పోర్ట్‌ఫోలియోని విస్తరించి, వెగోవీ పిల్ వెర్షన్‌ను మార్కెట్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చర్య 5 వేల మంది డెన్మార్క్ ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. నోవో కంపెనీ నాల్గవ త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్లను ఆదా చేయడం లక్ష్యంగా పెట్టింది.ఈ మొత్తాన్ని పరిశోధన, తయారీ విస్తరణలో తిరిగి పెట్టుబడి చేయనుంది.
సిడ్‌బ్యాంక్ విశ్లేషకుడు సోరెన్ లాంటాఫ్ట్ హాన్సెన్ ప్రకారం.. నోవో వేగవంతమైన వృద్ధి నుండి నెమ్మదిగా వృద్ధి చెందే వాస్తవికత వైపు మారుతున్నట్లు ఇది సూచిస్తోంది. డౌస్ట్‌డార్ కూడా ఈ చర్యను సంస్థ యొక్క దీర్ఘకాలిక విజయానికి సరైన నిర్ణయం అని పేర్కొన్నారు. ఈ భారీ jobs తొలగింపు నిర్ణయం నోవో నార్డిస్క్ యొక్క వ్యూహాత్మక మార్పులను ప్రతిబింబిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications