అమెరికా సుప్రీంకోర్టులో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే. డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన సుంకాల పెంపు విధానాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆ ఉత్తర్వులన్నింటినీ రద్దు చేసింది. దీంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అయితే Trump మరోసారి భారత్ మీద బాంబును పేల్చాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు నిర్ణయం గ్లోబల్ టారిఫ్ విధానానికి మాత్రమే వర్తిస్తుందని.. భారత్‌కు సంబంధించి ఇప్పటికే నిర్ణయించిన వాణిజ్య నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందంలో ఏమీ మారదు. భారత్ టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటుంది. మేము మాత్రం టారిఫ్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌కు సంబంధించిన వాణిజ్య విధానంలో అమెరికా వెనక్కి తగ్గబోతోందనే అంచనాలకు తావులేకుండా చేశాయి.
రెండు దేశాల మధ్య చర్చించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం మేరకు భారత వస్తువులపై సుమారు 18 శాతం టారిఫ్‌లు కొనసాగుతాయి. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై భారత్ నుంచి పెద్దగా టారిఫ్ భారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారత ఎగుమతిదారులకు కొంత భారం అయినప్పటికీ.. అమెరికా మార్కెట్‌లో ప్రవేశానికి ఇది ఒక అవకాశంగా కూడా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ట్రంప్ పరిపాలన విధించిన గ్లోబల్, పరస్పర టారిఫ్‌లు చట్టానికి విరుద్ధమని తీర్పు ఇచ్చింది. 1977లో రూపొందించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ఆధారంగా ఇంత విస్తృతంగా టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ట్రంప్ పరిపాలన అమలు చేసిన కొన్ని ప్రధాన టారిఫ్ విధానాలు రద్దయ్యాయి.
ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పు దేశ ఆర్థిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు. అదే సమయంలో మరో చట్టం అయిన Section 122 ఆధారంగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీని ద్వారా కోర్టు తీర్పు తర్వాత కూడా టారిఫ్ విధానాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తామని సంకేతాలు ఇచ్చారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యాన్ని చూస్తే.. ఇటీవల ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల్లో ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదిరినట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా విధిస్తున్న 25 శాతం వరకు ఉన్న అధిక టారిఫ్‌లను తగ్గించి 18 శాతానికి పరిమితం చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తన ఉత్పత్తులపై అదే స్థాయి టారిఫ్‌లు చెల్లించేందుకు అంగీకరించింది.
ఈ ఒప్పందం వల్ల భారత MSME రంగం, వ్యవసాయ ఉత్పత్తులు, చేపల ఎగుమతులు వంటి విభాగాలకు అమెరికా వంటి భారీ మార్కెట్‌లో అవకాశాలు పెరుగుతాయని భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సుమారు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు మరింత ప్రవేశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్ విధానాన్ని రద్దు చేసినప్పటికీ.. భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌పై నిర్ణయించిన టారిఫ్‌లు అమల్లోనే ఉంటాయని, రెండు దేశాల వాణిజ్య సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..



Click it and Unblock the Notifications