కరోనా మహమ్మారి కారణంగా చైనా నుండి పెద్ద మొత్తంలో కంపెనీలు ఇతర దేశాలకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిని ఆకర్షించేందుకు భారత్ సహా అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి విదేశీ కంపెనీలు నిష్క్రమించినప్పటికీ దాని వల్ల భారత్‌కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

చైనా కరెన్సీ విలువను తగ్గించుకుంటే..
కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని చాలామంది నిందిస్తున్నారని, చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమిస్తే భారత్ లాభపడుతుందని కొందరు అంచనా వేస్తున్నారని, కానీ అలా జరుగకపోవచ్చునని అభిజిత్ అన్నారు. చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఆ దేశ ఉత్పత్తులు మరింత చౌకగా లభిస్తాయన్నారు. దీంతో ప్రజలు వాటి కొనుగోళ్లను ఇప్పటిలాగే కొనసాగిస్తారని చెప్పారు. 'చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏమవుతుంది. ఆ దేశ ఉత్పత్తులు చౌక అవుతాయి. దాంతో ప్రజలు వాటిని కొనడాన్ని కొనసాగిస్తారు' అని అన్నారు.

వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారు
ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు అమెరికా, బ్రిటన్, జపాన్‌లు తమ జీడీపీలో అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నాయని చెప్పారు. మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ సమస్య నుండి బయట పడేందుకు కనీసం మూడు లేదా ఆరు నెలల పాటు పేదల చేతికి మరింత నగదు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాలు సామాన్యుల చేతుల్లోకి డబ్బులు పంపించాలని, వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారని, ధనవంతుల చేతుల్లోకి పంపించవద్దన్నారు.

ఎమర్జెన్సీ రేషన్ కార్డులు
పేదల చేతుల్లోకి మూడు నుండి ఆరు నెలలు మనీ పంపించేందుకు ఎమర్జెన్సీ రేషన్ కార్డులు ఈ కాలానికి గాను ఇష్యూ చేయాలన్నారు. మారటోరియం పొడిగించడం ద్వారా ప్రజలకు మరికొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇవే కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే డిమాండ్ ముఖ్యమని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్యాకేజీపై..
కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని, ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు జీడీపీలో 1% కంటే తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది ఏమాత్రం చాలదని, దీనిని మరింత పెంచాలని గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ఉద్దేశించి అన్నారు. జీడీపీలో కనీసం 10 శాతం ఉండాలని అభిప్రాయపడ్డారు. (అయితే ప్రధాని మోడీ నిన్న రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అంటే 10 శాతం ప్యాకేజీని ప్రకటించారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications