మీరు ఇప్పటివరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా..? అయితే కేంద్ర ఆర్థికశాఖ మీకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 31వ తేదీ లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. వాస్తవానికి ఐటీ రిటర్స్స్ ఫైల్ చేసే గడువు ముగిసిపోయింది.. కానీ ఫైల్ చేయనివారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో ఇప్పటివరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారు.. తమకు అంది వచ్చిన అవకాశంతో ఫైల్ చేసే వెసులుబాటు కలిగింది.

అడ్వాన్స్ ట్యాక్స్ కూడా..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడమే కాదు పన్ను ఆదా వ్యయాన్ని కూడా మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేసి.. అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలని పేర్కొన్నది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో మార్చి నెలలో ముఖ్యమైన తేదీలను కూడా ఐటీ విభాగం పేర్కొన్నది. ఇది పన్ను చెల్లింపుదారులకు మేలు చేకూరుస్తోంది.

లాస్ట్ ఛాన్స్..
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లింపుదారులు పన్ను చెల్లించేందుకు చివరి తేదీ 2020 మార్చి 31.. ఒకవేళ ఈలోపు పన్ను చెల్లించకుంటే.. వారు ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం కోల్పోతారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. గడువు లోపు ఒకవేళ పన్ను చెల్లించే వీలు లేని వారికి కూడా ఐటీ విభాగం సమయం ఇచ్చింది. కానీ అందుకు లేట్ ఫైలింగ్ కింద రూ.10 వేల వరకు కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది. రూ.5 లక్షల ఆదాయం సంపాదించే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కరెక్ట్ చేసుకునే అవకాశం
అంతేకాదు ఇదివరకు ఫైల్ చేసిన ఐటీఆర్‌లో ఏదైనా తప్పు చేశారనుకో.. రివైజ్డ్ ఫైలింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. వారు కూడా మార్చి 31లోగా తప్పులు సవరించుకోవాలని సూచించారు. ఆ గడువులోగా మార్పులు చేర్పులు చేపట్టకుంటే.. మార్పు చేయలేదని ఐటీ శాఖ పేర్కొన్నది. అంతేకాదు లేట్‌గా ట్యాక్స్ కట్టేవారు ఫైలింగ్ తప్పులు చేస్తే సరిదిద్దలేరనే విషయాన్ని గుర్తించుకోవాలని పేర్కొన్నది. 2019-2020 సంవత్సరానికి సంబంధించి 44ఏబీ, 44ఏడీఏ సెక్షన్ల కింద నాలుగు, చివరి అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయాలని ఐటీ శాఖ కోరింది.


Click it and Unblock the Notifications