Income Tax: ట్యాక్స్ సేవింగ్స్ కోసం ప్రస్తుతం పలు రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు బడ్జెట్లలో ఈ మేరకు కొన్ని మినహాయింపులు ఇచ్చి వేతన జీవులను సంతోష పెడుతుంటుంది. కాగా మారిన ట్యాక్స్ శ్లాబ్స్, బడ్జెట్ అనౌన్స్‌మెంట్స్‌కు అనుగుణంగా 10 లక్షల వరకు ఇప్పుడు పన్ను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..
వేతనం పెరుగుతున్న కొద్దీ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను భారం కూడా ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించుకునేందుకు ట్యాక్స్ పేయర్స్ దారులు వెతుకుతున్నారు. 10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పలు బెనిఫిట్స్ పొందేందుకు పాత పన్ను విధానాన్ని అనుసరించడం ఉత్తమంగా కనిపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం అందరినీ కొత్త పన్ను విధానంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

తాజా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేలకు పెంచబడింది. దీనితో పాటు ఇతర పన్నుల శ్లాబ్స్‌లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి 7.75 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తి పన్ను ఎటువంటి చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందులో పన్ను రాయితీలు తక్కువగా ఉండటంతో పాత విధానం వైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు.
10 లక్షల వరకు ఆదాయం పొందుతున్నవారు పాత విధానాన్ని ఎంచుకోవడం ద్వారా 50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందుతారు. ఇక సెక్షన్ 80C ద్వారా PPF, EPF, NSC వంటి పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. అలాగే NPSలో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 CCD (1B) కింద సంవత్సరానికి 50 వేల మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ విధంగా మొత్తం డిడక్షన్స్ తీసివేస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 7.50 లక్షలు అవుతుంది.
ఒకవేళ గృహ రుణం తీసుకుంటే, సెక్షన్ 24B కింద వడ్డీపై 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కోసం సెక్షన్ 80డి కింద 25 వేలు, భార్య, పిల్లల పేరిట కూడా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే మరో 50 వేలు తగ్గింపు పొందవచ్చు. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటే చివరకు 4.75 లక్షల ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. పాత పన్ను విధానంలో 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు కాబట్టి 10 లక్షలు సంపాదించే ఉద్యోగులు కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications