boycott china: చైనీయులకు గదులివ్వం, భోజనం పెట్టం.. హోటల్స్&రెస్టారెంట్స్
ఢిల్లీ: సరిహద్దుల్లో భారత్‌ను చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండటంపై భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కువమంది చైనా వస్తువులకు దూరంగా ఉంటామని ప్రకటిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) చైనా వస్తువులను బహిష్కరిస్తామని, తాము వాటిని దిగుమతి చేసుకోము, విక్రయించమని చెప్పారు. అయితే సినిమా, క్రీడాకారులు చైనా ఉత్పత్తులకు ప్రచారం మానుకోవాలని అప్పుడే ఇది సాధ్యమని లేఖలు రాశారు. తాజాగా ఢిల్లీ హోటల్ బాడీ మరో అడుగు ముందుకు వేసింది.

చైనా వస్తువులకు దూరం.. చైనీయులకు గదులివ్వం
భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించేందుకు ఢిల్లీలోని చిన్న హోటల్స్, రెస్టారెంట్ల నిర్వహకుల సంఘం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, చైనీయులకు గదులు అద్దెకు ఇవ్వమని స్పష్టం చేశాయి. వారికి భోజనం పెట్టమని, ఆ దేశ ఉత్పత్తులను ఉపయోగించమని తెలిపింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ CAITకు ఢిల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది.

మా మద్దతు... నో బుకింగ్స్, నో సేవలు
ఢిల్లీ హోటల్ బాడీ అసోసియేషన్‌లో దాదాపు మూడవేలకు పైగా బడ్జెట్ హోటల్స్, రెస్టారెంట్లు సభ్యుత్వం కలిగి ఉన్నాయి. CAIT తలపెట్టిన చైనా వస్తువుల బాయ్‌కాట్ ఉద్యమ ప్రచారానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా చైనీయుల నుంచి బుకింగ్స్ కూడా తీసుకోమని, సేవలను అందించమని ఢిల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ (DHROA) ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్త తెలిపారు.

3,000 హోటల్స్‌లో చైనా ఉత్పత్తులకు నో
తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులు ఉపయోగించమని ఢిల్లీ హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. తమతో పాటు ఇతర రాష్ట్రాల్లోని హోటల్స్ సంఘాలు కూడా ఇలాగే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతామని తెలిపాయి. ఢిల్లీలో DHROAలో 3,000 బడ్జెట్ హోటల్స్, గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. వీటిలో 75,000 వరకు గదులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications