కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలలో కోత విధించాలని ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉద్యోగులకు భారీ ఊరట కల్పించింది. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా ఉద్యోగులకు సమాచారం అందించారు.

సర్‌ప్రైజ్ ఇచ్చిన ఇండిగో సీఈవో
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ స్వచ్చంధంగా శాలరీ కట్‌కు ముందుకు రావొచ్చునని దత్తా కోరారు. మిగతా వారికి మాత్రం ఎలాంటి వేతన కోత ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్ నెల వేతనాలు చెల్లిస్తామని ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు. వేతనాలు లేవనుకున్న ఉద్యోగులకు ఇండిగో సీఈవో వేతనాలు ఇస్తామని చెప్పి ఒకింత సర్‌ప్రైజ్ ఇచ్చారు.

శాలరీ కట్ నుండి ఊరట
కరోనా కారణంగా ఎయిర్ లైన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్నీ గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి. ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో విమానయాన సంస్థలు ఉద్యోగులకు ఎంతోకొంత శాలరీ కట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇండిగో కూడా 25 శాతం కట్ చేస్తున్నట్లు గత నెల ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెలకు వేతనం కట్ చేయాలని గతంలో చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇండిగో తెలిపింది.

మీ శాలరీ మీకు వస్తుంది
ఏప్రిల్ నెలకు గాను సీనియర్ మెంబర్స్, సీనియర్ వీపీలు స్వచ్చంధంగా వేతన కట్‌కు ముందుకు రావొచ్చునని, మిగతా వారికి అందరికి కూడా ఏప్రిల్ నెలకు గాను మీ వేతనం మీకు వస్తుందని సీఈవో రోనోజాయ్ దత్తా పేర్కొన్నారు. తన వేతనంలో 25 శాతం, సీనియర్ వీపీలకు 20 శాతం, వీపీ, పైలట్స్‌కు 15 శాతం, కేబిన్ క్రూకు 10 శాతం, ఇతరులకు 5 శాతం కోత విధించాలని అంతకుముందు నిర్ణయించారు. ఇప్పుడు దీనిని వెనక్కి తీసుకున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications