బెంగళూరు నగరంలో ఓ టెకీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 30 లక్షల పన్నులు చెల్లించినా..నా జాబ్ పోతే ఈ దేశం నన్ను ఆదుకోలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. బెంగళూరు టెకీ చేసిన పోస్టు భారతదేశ మధ్యతరగతిపై, ప్రభుత్వ భద్రతా వ్యవస్థలపై పెద్ద చర్చకు దారి తీసింది. అధిక ఆదాయం కలిగిన ఓ బెంగళూరు టెకీ తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు దేశం పట్టించుకోలేదని అదే నేను ఉద్యోగం చేసే సమయంలో దేశానికి రూ. 30 లక్షలు ట్యాక్స్ రూపంలో కట్టానని చెప్పుకొచ్చారు. అయితే అతను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
ఆంటోని అనే ఓ టెకీ (పేరు మార్చాం) అనే ప్రముఖ యూనివర్సిటీ NIT నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నాడు. ఇటీవలే బెంగళూరులో ఉద్యోగం సంపాదించాడు. రూ. 43.5 లక్షల వార్షిక ప్యాకేజ్ కంపెనీ ఆఫర్ చేసింది. అయితే గత నెలలో అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. లేఆఫ్ తర్వాత కంపెనీ కేవలం మూడు నెలల సేవరెన్స్ పే మాత్రమే ఇచ్చి అతనిని ఇంటికి సాగనంపింది. ఆయన గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రూ. 30 లక్షలకు పైగా పన్నులు చెల్లించారని చెప్పుకొచ్చారు. కేవలం గత ఏడాదిలోనే రూ. 11.22 లక్షలు ఆదాయ పన్నుగా చెల్లించానని పోస్టులో తెలిపారు.

అయితే ఇప్పుడు నాకు ఉద్యోగం పోయింది. ఇద్దరు పిల్లల చదువుకు సంవత్సరానికి ఒక్కో పిల్లవాడిపై రూ. 1.95 లక్షలు ఖర్చు అవుతోంది. నాకు ఈ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన తీసుకున్న ఇంటిపై రుణం లేదని మాత్రం తెలిపారు. నేను ప్రభుత్వానికి లక్షల్లో పన్నులు చెల్లించాను. కానీ నాకు అవసరమైన సమయంలో అదే ప్రభుత్వం నాకు అండగా నిలబడలేదని పోస్ట్ రూపంలో వ్యక్తపరిచాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలను పోస్టులో తెలియజేస్తున్నారు.
సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం పోయిన వారికి అక్కడి ప్రభుత్వం నేరుగా సహాయం చేస్తుందా అని కొందరు ప్రశ్నించారు. మరి కొందరు "మీరు రూ. 45 లక్షల జీతాన్ని సంపాదించగలిగిన వ్యవస్థకే పన్నులు చెల్లిస్తున్నారు. అదే సమాజం మీకు ఆ అవకాశాల్ని ఇచ్చింది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొకరు ఘాటుగా స్పందిస్తూ.. మీరు యుధ్దంతో నలుగుతున్న గాజాలా రూ. 45 లక్షల జీతం సంపాదించగలరా? మనం జీతం సంపాదించే వ్యవస్థకే కదా పన్నులు చెల్లిస్తున్నామన్నారు.
మరికొందరు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.. మధ్యతరగతిపై భారం తగ్గించాలనే అవసరాన్ని ఈ పోస్ట్ సూచిస్తోందని చెబుతున్నారు. ఇలాంటివి మార్చాలంటే, పన్నుల ప్రాతిపదికను విస్తరించాలంటున్నారు. మిగిలిన వారు కూడా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి రావాలి. అప్పుడే మధ్యతరగతి పన్నుల భారం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. మరికొందరు కాస్తా ముందుకు వెళ్లి.. పాలకులు మారినా వచ్చే వారు మరింతగా పన్నులు వేయవచ్చు. మనం జీవితాన్ని పొదుపుగా గడిపినా, దాన్ని కూడా ప్రభుత్వమే లాక్కొనబోతోందని చెబుతున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగుల భద్రత,పన్నుల వాడకంపై పారదర్శకత, సామాజిక భద్రత వంటి అంశాలను ఎత్తి చూపుతోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..



Click it and Unblock the Notifications