ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధిక మంది చర్చించుకున్న ఒకే ఒక్క అంశం కరోనా వైరస్. చైనా లో మొదలైన ఈ మహమ్మారి... ప్రస్తుతం సుమారు 150 దేశాలను చుట్టేసింది. యూరోప్ ను గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అంతలా కరోనా తో దెబ్బతిన్న దేశం ఇటలీ. ఆ తర్వాత ఇరాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. సుమారు 2 లక్షల మందికి సోకిన కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు 7,000 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకుంది.
ఇందులో చైనా లో సగం మంది మరణించగా ... మిగితా సగం మంది వివిధ దేశాల్లో మృతి చెందారు. మన దేశంలోనూ 150 కేసులు, 3 మరణాలు సంభవించాయి. అయితే, భారత దేశంలో ఉన్న ఉష్ణోగ్రత పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని కొందరు భావిస్తున్నారు. సహజంగా దేశంలోని కొన్ని ప్రాంతాలు మినిహా సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు ఉండటం సహజం. అది కూడా ప్రస్తుతం ఎండాకాలం మొదలైంది కాబట్టి, ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎండలు పెరిగితే కరోనా చచ్చి పోతుంది అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

కెసిఆర్ చెప్పింది నిజమేనా....
ఇటీవల కరోనా వైరస్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు... 30 డిగ్రీల ఎండ ఉంటే కరోనా బతికే అవకాశం లేదని ఒక సీనియర్ డాక్టర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. అలాగే పారాసెటమాల్ మాత్రలు వేసుకుంటే దానిని కట్టడి చేయవచ్చని కూడా డాక్టర్ చెప్పారని కెసిఆర్ అన్నారు. దీనిపై అసెంబ్లీ లో ప్రతిపక్షాలు కొంత రాద్ధాంతం చేశాయి. కానీ, దానిపై మళ్ళీ వివరణ ఇచ్చిన కెసిఆర్ ... ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా... వారికి ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన వన్నీ చేస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... ఎండకు కరోనా వైరస్ వ్యాప్తికి ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రయత్నం చేసింది. ఈ అంశంపై నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను తన కథనంలో వెల్లడించింది.

పాక్షికంగా నిజమే...
మాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ... కరోనా వైరస్ అనేది సరికొత్త వైరస్ కాబట్టి సైంటిఫిక్ కమ్యూనిటీ కి దీని గురించి పెద్దగా తెలియదు. కానీ, మనం ఇప్పటివరకు చూసిన వైరస్/ఫ్లూ లు చలి, పొడి వాతావరణం లో వాటి సంఖ్యను పెంచుకుంటాయని తేలింది. వాతావరణం వేడిగా ఉంటే వాటి పునరుత్పత్తి అంత బాగా జరగదు. 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అది మరింత తగ్గిపోతుంది. ఈ అంశాలను మనం పాత వైరస్లలో చూశాం అని వెల్లడించారు. ఈయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ డైరెక్టర్ కూడా కావటం విశేషం. అంటే, వేడి ఎక్కువగా ఉండే వాతావరణంలో వైరస్ వృద్ధి చెందటం తక్కువగా జరుగుతుందని తేలుతోంది. అలా అని మనం 32 డిగ్రీల ఎండ ఉంది కదా అని వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా... కరోనా వైరస్ తో బాధపడుతున్న వారితో చనువుగా ఉంటానంటే కుదరదు. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

హ్యూమిడిటీ కారకం...
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రణదీప్ గులేరియా మాత్రం... కరోనా వైరస్ వృద్ధికి హ్యూమిడిటీ (గాలిలో తేమ శాతం) ప్రధాన కారణం అవుతుందని చెప్పారు. ఎండలు పెరిగినంత మాత్రాన వైరస్ చనిపోతుందని భావించనక్కరలేదని పేర్కొన్నారు. అత్యధిక వేడి వాతావరణం ఉన్న సింగపూర్ వంటి దేశాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని అయన ఉదహరించారు. ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగంలో అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్న నూతన్ ముండేజా మాత్రం ఎండకు, కరోనా వైరస్ కు సంబంధం లేదని, అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించారు. అయితే, ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఐన ఎల్ ఎన్ జే పీ మెడికల్ సూపరింటెండెంట్ మాత్రం చలి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని చెప్పారు. ఉదాహరణకు వైరస్ 8 గంటలు బతకాల్సి ఉంటే ... చలి వాతావరణం కారణంగా అది 2-3 రోజులు కూడా ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. సో, ఈ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మీరు కూడా ఎండకు - కరోనా వైరస్ కు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నించండి.
More From GoodReturns

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications