నీతి ఆయోగ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బ్లూ కాలర్, గ్రే కాలర్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక వెబ్సైటు ను రూపొందించనుంది. ఈ ప్రత్యేక జాబ్ పోర్టల్ లో వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే సుమారు 20 కోట్ల మంది శ్రామికులకు ప్రయోజనం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం మేరకు నీతి ఆయోగ్ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెద్ద ఎత్తున వలస కార్మికులు తమ పని ప్రదేశాలను వదిలేసి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ సడలించినప్పటికీ వారు మళ్ళీ పనికి తిరిగి రావటం లేదు. దీంతో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఫ్యాక్టరీలకు శ్రామికులు లభించటం లేదు... అలాగే సొంత ఊళ్లకు వెళ్లిపోయిన వారికి అక్కడ ఉపాధి దొరకటం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నీతి ఆయోగ్ ఒక జాబ్ పోర్టల్ ను రూపొందించి అందులో ఎక్కడికక్కడ స్థానికంగా లభించే ఉద్యోగాల వివరాలు వెల్లడించనుంది. దీంతో అటు కంపెనీలకు ఇటు శ్రామికులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఉన్నతి...
ప్రస్తుతం నీతి ఆయోగ్ సుమారు 7 టెక్నాలజీ ప్రొడక్టుల అభివృద్ధి చేపడుతోంది. వీటికి సంబంధించిన ప్రెసెంటేషన్స్ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వనున్నారు. అందులో 'ఉన్నతి' పేరుతో రూపొందించిన జాబ్ పోర్టల్ కూడా ఉందని సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.
ఈ ఉన్నతి పోర్టల్ ద్వారా దేశంలోని సుమారు 20 కోట్ల మంది శ్రామికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గాన్ని చూపవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక జాబ్ పోర్టల్స్ ఉన్నప్పటికీ... అవన్నీ ప్రైవేట్ రంగం లోనివే. కానీ నీతి ఆయోగ్ రూపొందిస్తున్న ఉన్నతి జాబ్ పోర్టల్ ప్రభుత్వ రంగ వెబ్సైటు కాబట్టి, మరింత మెరుగైన సేవలు ఉచితంగా లభిస్తాయని ఆశిస్తున్నారు.

12 కోట్ల మంది జాబ్స్ ఉఫ్...
కరోనా వైరస్ విజృంభించిన కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశంలో సుమారు 12.2 కోట్ల మంది శ్రామికులు ఉపాధి కోల్పోయారు. వారంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు. కానీ, జూన్ మొదటి వారంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్ళీ సుమారు 9.1 కోట్ల మంది శ్రామికులు తిరిగి పనిలో చేరిపోయారు. కానీ ఇప్పటికీ సుమారు 5 కోట్ల మంది వలస కార్మికులు ఉపాధి వేటలో ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వీరందరికి తమ తమ స్వస్థలం లోనే సంబంధిత ఉపాధి అవకాశాల వివరాలను తెలపటంతో వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మరో వైపు శ్రామికులకు ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా ప్రధాని మోడీ కోరినట్లు తెలుస్తోంది. దీంతో జాబ్ పోర్టల్ లో స్కిల్ డెవలప్మెంట్ కు సంబందించిన అనేక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

రాష్ట్రాలకు సొంత సైట్లు...
ఒకవైపు నీతి ఆయోగ్... ప్రస్తుతం ఉన్నతి జాబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉండగానే... ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు సొంతంగా తమ కార్మికుల కోసం ప్రత్యేకంగా జాబ్ పోర్టల్స్ రూపొందించాయి. వాటి ద్వారా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు, ఉద్యోగాలు కావాల్సిన వారిని అనుసంధానించి ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నాయి.
ఇదిలా ఉండగా... నీటి ఆయోగ్ ప్రస్తుత ప్రాజెక్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నెర్షిప్ (పీపీపీ) పధ్ధతి లో చేపడుతోంది. దీనికి నీటి ఆయోగ్ ట్రస్టీ గా ఉంటూ డేటా సెక్యూరిటీ వంటి కీలక అంశాల్లో థర్డ్ పార్టీ లను నియంత్రిస్తుంది. ఇదిలా ఉండగా... లేబర్ మినిస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లు కూడా వారి సొంత జాబ్ పోర్టల్స్ ను రూపొందించాయి. అయితే అవి కేవలం వైట్ కాలర్ జాబ్స్ కు మాత్రమే పరిమితం కాగా.. నీటి ఆయోగ్ పోర్టల్ మాత్రం విస్తృతంగా బ్లూ, గ్రే కాలర్ జాబ్స్ కోసం రూపొందిస్తుండటం విశేషం.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications