Infosys News: దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లు అందించిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అపాయిట్మెంట్ లెటర్లను అందించింది. రెండు విడతలుగా కంపెనీ ఇటీవల మెయిల్ ద్వారా అప్పట్లో ఎంపికైన విద్యార్థులకు సమాచారం పంపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐటీ ఉద్యోగుల యూనియన్.. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఇన్ఫోసిస్ జాయినింగ్ లెటర్లపై స్పందించారు. గ్రాడ్యుయేట్లు చేరేందుకు ఇచ్చిన తేదీలో ఈసారి ఏదైనా ఉల్లంఘన జరిగితే పూణేకి చెందిన యూనియన్ ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆఫర్ లెటర్ ప్రకారం చేరడం రెండేళ్లుగా ఆలస్యం అయిన 1,000 మంది ఫ్రెషర్‌లను అక్టోబర్ 7, 2024న చేరాల్సిందిగా కంపెనీ ఇటీవల మెయిల్స్ పంపిన సంగతి తెలిసిందే.

రెండేళ్లుగా ఎదురుచూస్తున్న 1,000 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఆఫర్ లెటర్‌ను విడుదల చేసింది. నిరంతర ప్రయత్నాలు, ఇన్ఫోసిస్‌లోని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత కంపెనీ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటం సంతోషంగా ఉందని హర్‌ప్రీత్ సింగ్ సలూజా చెప్పారు.
దాదాపు రెండేళ్లకు పైగా ఎదురుచూపుల్లో గడిపిన గ్రాడ్యుయేట్లకు ఇక వేచిఉండాల్సిన పరిస్థితులు సొమసిపోయాయని అన్నారు. అలాగే ఇది నైట్స్, ఆలస్యాన్ని ఎదుర్కొని బలంగా నిలబడిన విద్యార్థులందరికీ భారీ విజయంగా ఆయన పేర్కొన్నారు.
తాము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉన్నామని సింగ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైతే, గ్రాడ్యుయేట్ల చేరిక తేదీని ఉల్లంఘిస్తే, ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి మేము వెనుకాడబోమని హెచ్చరించారు. అయితే కంపెనీ సీఈవో సాహిల్ పారిఖ్ మాత్రం ఇటీవల విద్యార్థులకు హామీ ఇస్తూ బెంగళూరు ప్రధాన కార్యాలయంలో సిస్టమ్ ఇంజనీర్లుగా ఆఫర్ లెటర్ పొందిన అడుగుపెడతారని చెప్పారు. అయితే ఈ క్రమంలో ప్రీ-ట్రైనింగ్ సెషన్‌లు తీసుకోవాలని చెప్పారు. అలాగే కంపెనీ ఇచ్చిన ప్రతి ఆఫర్ లెటర్ గౌరవించటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు పారిఖ్ తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications