భారతదేశాన్ని కొత్త దశాబ్దంలోకి మార్చడమనే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ క్రమంలో స్కూల్ అండ్ కాలేజ్ సమయంలోనే పిల్లలకు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలని అన్నారు. వీటికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం ఆర్బీఐ, సెబీతో పాటు ఇతర సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వీటిని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన ఆవస్యకతను నొక్కి చెప్పారు.
స్వదేశీ రక్షణ పరికరాల తయారీ గురించి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే ప్రక్రియలో కొన్ని కాంపొనెంట్స్, ముడి పదార్థాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని ఆమె అభిప్రాయపడ్డారు. 2024 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతుల విలువ రూ.24,000 కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. భారత రక్షణ పరిశ్రమ తొలిసారిగా రూ.లక్ష కోట్లకు పైగా ఉత్పత్తి విలువతో చారిత్రాత్మక మైలురాయిని సాధించినట్లు చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలను సీతారామన్ తోసిపుచ్చారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం రానున్న కాలంలో డిమాండ్ పెరుగుతుందని నిర్మలమ్మ తెలిపారు. ఈ క్రమంలో యువతకు ఏఐ సామర్థ్యాలను ఉపయోగించుకునే కొత్త డొమైన్‌లలో అవకాశాలను తెరుస్తుందని అన్నారు. ఆర్థిక సంబంధాలు మరియు కరెన్సీ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక ఎత్తుగడను సూచిస్తూ.. భారతీయ రూపాయల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు ఆఫ్రికా దేశాలు, రష్యా, శ్రీలంకలతో చర్చలు జరుగుతున్న విషయాన్ని వెల్లడించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications