Nirmala Sitharaman: వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఎన్నికైన తర్వాత ప్రస్తుతం మూడవ టర్మ్ కొనసాగుతోంది. అయితే తొలి టర్మ్ లోనే వ్యాట్ పన్ను విధానానికి బదులగా జీఎస్టీ పన్ను రేటు విధానాన్ని తీసుకురావటం ద్వారా పన్నుల వ్యవస్థ సరళీకృతం కావటంతో పాటు పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని నిర్ణయించింది. కానీ ఇది ప్రజలపై అధిక భారాన్ని కలిగిస్తోందనే వాదనలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం జీఎస్టీ పన్ను విధానంపై కీలక ప్రకటన చేశారు. రానున్న కాలంలో తమ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మరింతగా తగ్గించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జీఎస్టీ రేట్లను తగ్గిస్తామని, ఇందులోస పన్ను శ్లాబ్ రేట్లను మరింత సరళంగా మార్చేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జీఎస్టీని దేశంలో ప్రవేశపెట్టినప్పుడు 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు ప్రస్తుతం 2023 నాటికి 11.4 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ఇది మరింతగా తగ్గుతుందని పేర్కొన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సెప్టెంబర్ 2021లో జీఎస్టీ రేట్ల సమీకరణ, పన్ను స్లాబ్‌లలో మార్పులు సూచించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. జీఎస్టీ రేట్ల సమీకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని ఆర్థిక మంత్రి ఒక కార్యక్రమంలో వెల్లడించారు. జీఎస్టీ రేట్ల సవరించబడిన ప్రతిపాదనను తదుపరి కౌన్సిల్ సమావేశంలో సమీక్షించి, నిర్ణయం తీసుకుంటామని సీతారామన్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆమె స్టాక్ మార్కెట్ల ఓలటాలిటీ, అస్థిరతలతో పతనం గురించి ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితులను సూచిస్తూ పూర్తి స్థాయి స్థిరత్వాన్ని అంచనా వేయడం కష్టమని సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గింపుపై మాట్లాడుతూ.. రిటైల్ పెట్టుబడిదారుల పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పబద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, ప్రభుత్వం కొన్ని బ్యాంకుల్లో తన వాటాను తగ్గించేందుకు సిద్ధమవుతోందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్యను పెంచాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక పరిసరాల మార్పులను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకింగ్ రంగం సాంకేతికత, సుస్థిరత, సమగ్రతను అవలంబించాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వ్యక్తిగత పంపిణీ ఛానెల్‌లను పునఃరూపకల్పన చేస్తూ, వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. వాస్తవానికి గత బడ్జెట్ ప్రసంగంలో ఆమె న్యూ టాక్స్ రీజిమ్ కింద పన్ను రహిత ఆదాయాన్ని పెంచటం దేశంలోని ప్రజల చేతిలో కొనుగోలు చేసే శక్తిని పెంచటానికి అదనపు నిధులను అందిస్తోంది. దిగజారిన వృద్ధిని గాడిలో పెట్టేందుకే ఈ చర్య అని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపు కూడా ఇందులో భాగంగానే వస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications