కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త అందుతుందని చాలా మంది భావించారు. కానీ కేంద్రం అన్నదాతలకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ముఖ్యంంగా పీఎం కిసాన్ యోజన రూ.6 వేల నుంచి రూ.8 వేలకు పెంచుతారాని అందరు భావించారు. కానీ కేంద్రం మాత్రం అదే రూ.6 వేల సహాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పింది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో తీసుకొచ్చారు.
ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తోన్నారు. ఇప్పటికి వరకు 15 విడుతలుగా రైతులు ఖాతాల్లో రూ.30 వేలు జమా చేసింది. అయితే కూలీ ధరలు, ఎరువుల ధరలు, దుక్కి దున్నే ట్రాక్టర్ కిరాయి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రూ.6 వేల సొమ్మును రూ.8 వేలకు పెంచుతారని అనుకున్నారు. ఎందుకంటే త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. కానీ ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ యోజన డబ్బులు పెంచలేదు.

దేశంలో పీఎం కిసాన్ యోజన ద్వారా 11.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామని చెప్పారు. నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం తీసుకొస్తామని చెప్పారు. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్ గోకుల మిషన్ ద్వారా ఆర్థికసాయం అందిస్తామన్నారు. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సాయం అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకు వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. కాగా తెలంగాణలో రైతులు ఆదుకునేందుకు రైతు బంధు అమలు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని రైతు భరోసాగా మార్చి సాయాన్ని కూడా పెంచునున్నారు.


Click it and Unblock the Notifications