పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఉచ్చు బిగిసింది. PNB నుండి దాదాపు రూ.14వేల కోట్లు తీసుకొని 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం యూకే హోం సెక్రటరీ నీరవ్ మోడీని అప్పగిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వుపై బ్రిటన్ హోం శాఖ మంత్రి సంతకం చేసినట్లు భారత సీనియర్ దౌత్యవేత్తలు తెలిపారు. నీరవ్ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు సిద్ధంగా ఉంది. ఆయనను జైలులోని 12 బ్యారక్‌లో ఉంచనున్నారు.
బ్రిటన్ హోం మంత్రి ఉత్తర్వును నీరవ్ న్యాయపరంగా సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతి కోసం ఆయన 14 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. PNB స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ ప్రస్తుతం లండన్ నైరుతి ప్రాంతం వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. ఈ స్కాంపై నీరవ్ భారత న్యాయస్థానాలకు సమాధానం చెప్పాల్సిందేనని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. అయితే ఆయన అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వు జారీచేసే అధికారాన్ని బ్రిటన్ కేబినెట్ మంత్రికి వదిలేసింది.

భారత్‌కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, మెడికల్ పరమైన అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నీరవ్ వాదించారు. అయితే ఈ వాదనలను అక్కడి కోర్టు కొట్టి వేసింది. భారత్‌కు అప్పగిస్తే నీరవ్‌కు అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఆధారాల్లేవని, మానవ హక్కుల విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications