నష్టాల్లో మార్కెట్లు, 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్21) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.19 సమయానికిసెన్సెక్స్ 17.74 పాయింట్లు(0.05 శాతం) లాభపడి 38,863.56 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు(0.07 శాతం) లాభపడి 11,513 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10.40 సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 38,930 వద్ద ఉంది. అయితే సాయంత్రానికి సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం ఐటీ ఇండెక్స్ భారీగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు 2 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. మార్కెట్లు గత సెషన్‌లో నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 134 పాయింట్లు, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ రోజు తిరిగి లాభాల్లో ప్రారంభమైన, చివరలో కుప్పకూలాయి. ఉదయం మార్కెట్ ఎలా ఉందంటే..

టాప్ గెయినర్స్.. లూజర్స్

టాప్ గెయినర్స్.. లూజర్స్

ఉదయం గం.10.45 సమయానికి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ ఉన్నాయి. మోస్ట్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో ఉన్నాయి. మోస్ట్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, నెస్ట్లే ఉన్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది. ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఐటీ స్టాక్స్ జూమ్

ఐటీ స్టాక్స్ జూమ్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ అదరగొట్టింది. 4 శాతానికి పైగా లాభపడి రూ.844 వద్ద ట్రేడ్ అయింది. విప్రో షేర్ 1.56 శాతం పెరిగి రూ.321.50 వద్ద ట్రేడ్ అయింది. టీసీఎస్ షేర్ 1.53 శాతం లాభపడి రూ.2,487.50 వద్ద ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్ షేర్ ధర 2.18 శాతం లాభపడి రూ.1,024 వద్ద ట్రేడ్ అయింది. టెక్ మహీంద్రా 2.14 శాతం లాభపడి రూ.822 వద్ద ట్రేడ్ అయింది. ఇక రిలయన్స్ షేర్ ధర 0.67 శాతం ఎగిసి రూ.2,321 వద్ద ట్రేడ్ అయింది.

మార్కెట్ ఊగిసలాటలోనే..

మార్కెట్ ఊగిసలాటలోనే..

సరిహద్దుల్లో చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా ఎక్కువగానే ఉండటం ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దిగ్గజ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో ఉంది.

రూట్ మొబైల్స్ లిస్టింగ్

రూట్ మొబైల్స్ లిస్టింగ్

ఒమ్నిఛానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ సంస్థ రూట్ మొబైల్ లిస్టింగ్ అయింది. ఇష్యూ ధర రూ.350 కాగా బీఎస్ఈలో ఏకంగా రూ.708 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇది 102 శాతం లాభం. ప్రస్తుతం రూ.641 వద్ద టేర్డే అవుతోంది. ఈ నెల 11వ తేదీన రూట్ మొబైల్ ఇష్యూ 73 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ అయింది. గత వారం లిస్ట్ అయిన ఐటీ సేవల సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ 111 శాతం ప్రీమియంతో స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+