అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లకు షాక్ ఇచ్చిన ఎన్జీటీ..జరిమానా వసూలుకు సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకు ఆదేశాలు

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్, అలాగే ఫ్లిప్ కార్ట్ ల నుండి జరిమానా వసూలు చెయ్యాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది .పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు పర్యావరణ ఆడిట్ నిర్వహించి అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ నుంచి జరిమానా వసూలు చేయాలని జాతీయ కాలుష్య నియంత్రణ మండలికి (సిపిసిబి) జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కామర్స్ సంస్థలపై జాతీయ కాలుష్య నియంత్రణా మండలి చర్యలు తీసుకోవటం లేదన్న ఎన్జీటీ

ఈ కామర్స్ సంస్థలపై జాతీయ కాలుష్య నియంత్రణా మండలి చర్యలు తీసుకోవటం లేదన్న ఎన్జీటీ

ఇ-కామర్స్ సంస్థలు చట్టబద్ధమైన నిబంధనలను అతిక్రమిస్తున్నాయని , పాల్స్తిక్ వినియోగంతో కాలుష్యానికి కారణం అవుతున్నాయని వారిపై జరిమానాలు , కఠిన చర్యలు అమలు చేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణా మండలి దృష్టి సారించటం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయపడింది . ఎన్జీటీలో సిపిసిబి ఒక నివేదికను దాఖలు చేసింది. ఆ నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం సిపిసిబి నేరుగా లేదా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులతో సమన్వయంతో తీసుకున్న కఠిన చర్యల గురించి ప్రస్తావించలేదని ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఎకె గోయెల్ అన్నారు.

ఈ కామర్స్ సైట్స్ నుండి జరిమానా వసూలుకు ఎన్జీటీ ఆదేశం .. అక్టోబర్ 14 లోపు నివేదిక

ఈ కామర్స్ సైట్స్ నుండి జరిమానా వసూలుకు ఎన్జీటీ ఆదేశం .. అక్టోబర్ 14 లోపు నివేదిక

"సిపిసిబి కాలుష్యానికి కారణం అవుతున్న సంబంధిత సంస్థలకు వ్యతిరేకంగా పర్యావరణ ఆడిట్ కు ఆదేశించవచ్చు అంతే కాకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు పరిహారాన్ని అంచనా వేయవచ్చు మరియు జరిమానాలు వసూలు చెయ్యవచ్చు అని ఇది చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తుంది" అని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో ట్రిబ్యునల్ చర్యలకు ఆదేశించటం తో పాటు, జరిమానాలు విధించి చర్య తీసుకున్న నివేదికను అక్టోబర్ 14 లోపు తమకు పంపాలని చెప్పింది .

 ప్లాస్టిక్ ప్యాకేజింగ్ తో పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఈ కామర్స్ సైట్స్

ప్లాస్టిక్ ప్యాకేజింగ్ తో పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఈ కామర్స్ సైట్స్

ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 ప్రకారం ఇ-కామర్స్ దిగ్గజాలు తమ వ్యాపారం విస్తరించిన ప్రాంతాల్లో పర్యావరణ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది . తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ వల్ల ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సిపిసిబి ఇంతకు ముందు ఎన్జిటికి తెలిపింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016 లోని 9 (2) నిబంధనల ప్రకారం, "ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు లేదా పర్సులు లేదా ప్యాకేజింగ్ సేకరణకు ప్రాథమిక బాధ్యత తయారీదారులు , దిగుమతిదారులు మరియు బ్రాండ్ యజమానులదేనని అపెక్స్ కాలుష్య పర్యవేక్షణ సంస్థ ఎన్జిటికి తెలిపింది. వారు మార్కెట్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారని పేర్కొంది.

16 ఏళ్ళ బాలుడి పిటీషన్ తో విచారణ జరిపిన ఎన్జీటీ

16 ఏళ్ళ బాలుడి పిటీషన్ తో విచారణ జరిపిన ఎన్జీటీ

ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లను తమ ప్యాకేజింగ్‌లో అధిక ప్లాస్టిక్ వాడకం ఆపమని ట్రిబ్యునల్‌ను సంప్రదించిన 16 ఏళ్ల బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.సంస్థలు అందించే సరుకులను ప్యాకేజింగ్ చేయడంలో అధికంగా ప్లాస్టిక్ వాడకాన్ని ఆపమని అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లను ఆదేశించాలని ఆదిత్య దుబే తన లీగల్ గార్డియన్ ద్వారా ఎన్‌జిటిని అభ్యర్థించారు.ఇ-కామర్స్ కంపెనీలు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016 పరిధిలో ఉన్నాయి. కానీ పర్యవేక్షణ మరియు అమలు లేకపోవడం వల్ల, సదరు సంస్థలు తమ అమ్మిన వస్తువులను ప్యాకేజింగ్ చేయడానికి అధిక మొత్తంలో ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తూనే ఉన్నారు అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ సంస్థల వల్ల విపరీతమైన పొల్యూషన్ .. అందుకే ఈ నిర్ణయం

అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ సంస్థల వల్ల విపరీతమైన పొల్యూషన్ .. అందుకే ఈ నిర్ణయం

అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల్లో వస్తువులను కొనుగోలు చేశాక వాటిని కవర్ చేసిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కవర్లను బయట పడేయటం వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది . ఇది భూమిపై భారం కలిగిస్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమి మీద ఉన్న అతిపెద్ద పర్యావరణ సవాళ్లలో ఒకటిగా అవతరించింది. ఇది బయోడిగ్రేడబుల్ కానిది మరియు చాలా తక్కువ శాతంలో రీసైకిల్ చేయబడుతోంది అంటే, కాలక్రమేణా ఇండియా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పెద్ద డంపింగ్ గ్రౌండ్‌గా మారుతోంది, ఇది మైక్రోప్లాస్టిక్స్ గా మారి నేల మరియు నీటిని కలుషితం చేస్తుంది అని పిటీషన్ లో పేర్కొన్న మీదట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది .

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+