ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. మరో బాహుబలి ఐపీఓ త్వరలో రానుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ బేస్డ్‌గా ఇది స్టాక్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. బ్లాక్‌స్టోన్‌కు చెందిన నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఐపీఓను జారీ చేయడం ద్వారా 3,200 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించుకోనుందా కంపెనీ.
నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్.. షాపింగ్ మాల్స్‌ను నిర్వహించే సంస్థ. దేశవ్యాప్తంగా 14 నగరాల్లో 17 బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ ఈ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. సెలెక్ట్ సిటీవాక్- న్యూఢిల్లీ, నెక్సస్ సీవుడ్స్-నవీ ముంబై, నెక్సస్ కోరమంగళ- బెంగళూరు, నెక్సస్ వైట్‌ఫీల్డ్- బెంగళూరు, నెక్సస్ ఎలాంటె- చండీగఢ్, నెక్స్ అహ్మదాబాద్ వన్- అహ్మదాబాద్, నెక్సస్ ఇండోర్ సెంట్రల్- ఇండోర్ వంటి పేర్లతో మెట్రోపాలిటన్ నగరాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తోందీ సంస్థ.

యాపిల్, జరా, హెచ్ అండ్ ఎం, యూనిక్లో, సెఫోరా, సూపర్‌డ్రై, లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్.. వంటి మల్టీ బ్రాండ్స్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. నెక్సస్ షాపింగ్ మాల్స్ అన్నింట్లో ఆయా కంపెనీలకు చెందిన బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయి. 96 శాతం లీజ్‌తో నడిచేవే. ఈ 17 షాపింగ్ మాల్స్‌లల్లో కూడా ఇలాంటివి 3,000 పైగా షోరూమ్స్ ఉన్నాయి.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో 1,318.21 కోట్ల రూపాయల మేర రెవెన్యూను సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ మొత్తం అధికం. స్థూల నష్టాలను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడించింది. ఈ సంఖ్య 10.95 కోట్ల రూపాయలుగా పేర్కొంది. తాజాగా ఈ సంస్థ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది.

3,200 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐపీఓ ద్వారా సమీకరించుకునే మొత్తంలో నుంచి 1,050 కోట్ల రూపాయలను బ్యాంక్ రుణాలను చెల్లించడానికి మళ్లిస్తామని తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్‌కు అందజేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరించింది. మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, కోటక్ మహీంద్ర క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, బీఓఏ ఎంఎల్.. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరిస్తోన్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications