PM Kisan: రైతులకు శుభవార్త.. వారం రోజుల్లో పీఎం కిసాన్ 16వ విడత నిధులు విడుదల..
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 16 విడత డబ్బులను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో రూ.2 జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సాయం అందిస్తున్నారు.
నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే 15 విడుతలుగా రూ.30 వేలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 16వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతేడాది నవంబర్ లో 15 విడత విడుదల చేశారు. 8 కోట్ల మంది అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశారు.

పీఎం కిసాన్ నిధులను ఈ కేవైసీ పూర్తు చేసుకున్న రైతులకు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ కేవైసీ లేని వారికి నిధులు రావడం లేదు. ఇప్పటికీ పీఎం ఈ కేవైసీ చేయని వారు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రం ప్రభుత్వం కూడా రైతులకు సాయం చేస్తోంది. రాష్ట్ర రైతులు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తోంది.ఇది త్వరలోనే రైతు భరోసాగా మారనుంది.
రైతు భరోసాగా మారిన తర్వాత ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనన్నారు. ఈసారి సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరు ఎకరాల లోపు వారికే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రుణ మాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 లక్షల రుణ మాఫీ చేయనున్నారు.


Click it and Unblock the Notifications