ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతుంటే.... భారత్ కు మాత్రం పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అలాగని భారత్ లో కరోనా వైరస్ ప్రభావం లేదని కాదు. ప్రస్తుతం అమెరికా తర్వాత మన దేశంలోనే అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 30,000 కు పైగా కొత్త కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 10,00,000 కేసుల మార్కు దాటి పోయింది.
అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వంటి అవరోధాలు ఉన్నప్పటికీ భారత్ కు వచ్చే దశాబ్ద కాలం బాగా కలిసి రానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిని ఇటీవలి కాలంలో ఇండియా లోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడుల సరళి ప్రస్ఫుటం చేస్తోందని చెబుతున్నారు. అందుకే వచ్చే 10 ఏళ్ళు భారత్ దే నని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో ఈ కామర్స్, ఫార్మస్యూటికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా కు చెందిన ప్రముఖ వెంచర్ కాపిటల్ కాపిటలిస్ట్, పారిశ్రామికవేత్త, ఫిలాంత్రపిస్ట్ ఎం ఆర్ రంగస్వామి ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఈ వివరాలు వెల్లడించారు.

20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు...
గత ఆరు నెలలుగా అమెరికా సహా ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంటే భారత్ కు మాత్రం ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం విశేషం. రంగస్వామి అంచనా ప్రకారమే గత కొన్ని నెలల్లోనే 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ 1,50,000 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. దీంతో ఇండియా కు ప్రస్తుతం స్వర్ణ యుగమేనని అయన అభివర్ణించారు. కిరాణా షాపులు మొదలు కొని, మెడిసిన్, టెలి మెడిసిన్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో అపార అవకాశాలు ఉన్నాయి. ఈ బంగారు అవకాశాన్ని భారత్ చక్కగా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఒక స్వర్ణ యుగంలోకి భారత్ ప్రవేశించే సమయం ఎంతో దూరంలో లేదు అని ఆయన పేర్కొన్నారు.

చైనా పై కోపం కూడా...
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు చైనా అంటే మహా చిరాకు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత అది మరింత అధికం అనినట్లు తోస్తోంది. అందుకే చైనా పై ఉన్న కోపం నేపథ్యంలో అమెరికా కంపెనీలు భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ట్రంప్ నిర్ణయాలు కూడా దోహదపడుతున్నాయని రంగస్వామి చెబుతున్నారు. దీంతో రాగల రోజుల్లో ఇండియా లోకి మరిన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు, ముఖ్యంగా అమెరికా నుంచి వెల్లువలా వచ్చి పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇటీవలి గూగుల్, పేస్ బుక్ పెట్టుబడులనే ఆయన ఇందుకు ఉదాహరణగా చూపారు. మర్రిన్ని పెట్టుబడి సంస్థలు, సౌవారిన్ ఫండ్స్ పెట్టుబడులతో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

100 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు...
ప్రస్తుతం ఇండియా లో 50 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. త్వరలోనే ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకోనుంది. కరోనా వైరస్ తో పాటు అనేక కారణాలు, భారత ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ లకు ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో దేశంలోని ప్రజలంతా తప్పనిసరిగా డిజిటల్ టెక్నాలజీ లను అందిపుచ్చుకుంటున్నారు. ఇదే ఇండియాకు గొప్ప వరంగా మారబోతోందని రంగస్వామి అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో చైనా తో అమెరికాకు నెలకొన్న అనేక వివాదాలు కూడా భారత్ కు సానుకూలంశాలుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కలిసి వచ్చే 10 ఏళ్లలో భారత్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధికారిక దేశంగా ఆవిర్భవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications