మరొక ఏడాది గడిచిపోయింది. ఎన్నో మంచి చెడు అనుభవాలు. కొన్ని ఆశలు నెరవేరవచ్చు.. మరికొన్ని నెరవేయకపోవచ్చు. నెరవేరని కోరికల కోసం మరింతగా శ్రమిస్తూ ముందడుగు వేయాల్సిన తరుణం. నిరాశలను పక్కన బెట్టి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాల్సిన అవసరం. ఇక ఆర్ధిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలో కుటుంబాల బడ్జెట్ పై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబ బడ్జెట్ ను కట్టడి చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటున్నారు.అయితే ఇంటికి ఆర్ధిక మంత్రిగా ఉండే మహిళలు కొత్త ఏడాదిలో ఇలా చేయండి.

ఖర్చులపై కన్నేసి ఉంచండి..
పిల్లల చదువులు, ఇంటి అద్దెకు, ఆరోగ్య పరమైన ఖర్చులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటికి ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు కూడా తోడయ్యాయి. ఉల్లి, ఎల్లి ధరలు కంట తడి పెట్టిస్తున్నాయి. వీటిని కొనాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. మిగతా సరుకుల పరిస్థితి కూడా అంతే ఉంది. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీటిని ఏ స్థాయిలో కొనుగోలు చేయాలో ఒక అంచనాకు రండి. ఎక్కువ ధరలు తక్కువగా కొనుగోలు చేస్తూ.. తక్కువ ధర ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. నిత్యావసర సరుకులకు సంభందించి పెద్ద పెద్ద స్టోర్లు వారంలో ఏదో ఒక రోజు తక్కువ ధరలకు సరుకులను విక్రయిస్తుంటాయి. అప్పుడు మీకు అవసరమైన వాటిని కొనుగోలు చేయడం వల్ల కలిసివస్తుంది.
వారాంతాల్లో కొంత మంది తమ కుటుంబ సమేతంగా హోటళ్లకు వెళ్లి భోజనాలు చేస్తుంటారు. అయితే వీటివల్ల ఖర్చు బాగానే పెరుగుతుంది. ఇలాంటి వాటిని తగ్గించుకోవడం వల్ల మీ బడ్జెట్ పై ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయి కదా అని అనవసర ఉత్పత్తుల కొనుగోళ్ల జోలికి వెళ్లక పోవడం మంచింది. మీ కుటుంబానికి అవసరమైన వాటిని తగ్గించుకోకుండా అనవసరమైన ఖర్చులకు చెక్ పెట్టండి. గత నెల ఈ నెల ఖర్చుల్లో ఉంటున్న తేడాలను గమనించండి.

కుటుంబ ఆర్ధిక నిర్ణయాల్లో పాలుపంచుకోండి..
ఈ రోజుల్లో చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు. పిల్లల భవిష్యత్ తో పాటు ఆర్ధిక పరంగా మరింత ముందడుగు వేయడానికి ఈ రోజుల్లో పెట్టుబడులు పెట్టవలసి వస్తోంది. కుటుంబానికి భద్రతను ఇచ్చే ఆరోగ్య, సాధారణ బీమాను తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి సంబందించిన నిర్ణయాల్లో మహిళలు కూడా పాలు పంచుకోవాలి. కొంత మంది తమకు ఈ విషయాలు అర్థం కావని వదిలేస్తుంటారు. కానీ వీటి గురించి చర్చించే సమయంలో పాల్గొని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. తగిన సలహాలు సూచనలు చేయాలి. ఇంటి కొనుగోలు, వాహనాల కొనుగోలు, పెట్టుబడుల విషయంలో తగిన సలహాలు ఇవ్వడంతో పాటు వాటి కోసం అవుతున్న మొత్తాన్ని తెలుసుకోవడం ద్వారా మీకు కూడా మరింత అవగాహన పెరుగుతుంది.

ఫైనాన్షియల్ టిప్స్ తెలుసుకోండి..
కొంతమంది మహిళలు ఇంటి భాద్యతలు చూసుకుంటూనే ఉద్యోగం కూడా చేస్తుంటారు. ఇలాంటి వారికి అసలు తీరిక ఉండదు. వీరిపై ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఒక్కో సమయంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. వీటిని ఎదుర్కోవడానికి మీనుంచి మీ భర్త సలహాలు కోరవచ్చు. ఆలాంటి సమయంలో తగిన సలహాలు ఇచ్చే విధంగా మీరు పలు ఆర్ధిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. పర్సనల్ ఫైనాన్స్ పై పత్రికలు, మ్యాగజైన్ లలో విభిన్న రంగాల ఆర్టికల్స్ వస్తుంటాయి. మీకు తీరిక ఉన్న సమయంలో వీటిని చదవడం ద్వారా మీ ఫైనాన్స్ ను ఏ విధంగా మేనేజ్ చేయవచ్చో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని మరొకరితో కూడా పంచుకొని ప్రయోజనం పొందే ఆస్కారం కూడా ఉంటుంది.

బీమా మరవొద్దు..
మహిళలు కుటుంబ, వృత్తి పరమైన భాద్యతలు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు అనారోగ్యానికి గురి అవుతుంటారు. ఈ రోజుల్లో ఆస్పత్రిలో చేరితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. బిల్లులతో మొత్తం కుటుంబమే ఆర్ధిక సంక్షోభంలో పడే పరిస్థితి. కాబట్టి మహిళలు ఆరోగ్య బీమా తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దు. కుటుంబ సభ్యులందరికి కలిపి బీమా తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియం తోనే తగిన స్థాయిలో బీమా భద్రతను పొందే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications