మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేళ నగరంలో కఠిన ఆంక్షలు అమల్లోకి..

న్యూ ఇయర్‌ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఈ సందర్భంగా Cyberabad నగరంలో ట్రాఫిక్ నియంత్రణలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు, మద్యం విక్రయ పరిమితులు వంటి పలు నియమాలు అమల్లోకి వచ్చాయి. Hyderabad నగరంలో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రధాన మార్గాలు, ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్ రోడ్‌లకు ఈ సమయంలో ఎంట్రీ నిలిపివేయనున్నారు. బేగంపేట, టోలీచౌక్ మినహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. ప్రత్యేకంగా, ఫ్లైట్‌ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే పీవీ ఎక్స్‌ప్రెస్ రోడ్ ద్వారా అనుమతి ఇవ్వబడింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సిటీలోకి ప్రవేశించరాదని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, నగరంలో మెట్రో రైళ్లు కూడా నూతన సంవత్సర వేడుకలకు అనుగుణంగా ప్రత్యేక షెడ్యూల్‌లో నడపబడతాయి. సాధారణంగా రాత్రి 11 గంటలకు చివరి సర్వీస్ ప్రారంభమవుతుంది, కానీ డిసెంబర్ 31న స్టార్టింగ్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరతాయి. అలాగే, సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్, రద్దీ ప్రకారం ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యంగా నడిపేలా ఏర్పాట్లు చేశారు.

Cyberabad New Year traffic Cyberabad traffic curbs December 31 New Year Eve drunk driving checks Cyberabad police traffic rules New Year safety Cyberabad traffic restrictions Cyberabad December 31 traffic advisory Cyberabad police enforcement New Year Eve traffic update drunk driving crackdown Cyberabad 31 Cyberabad New Year traffic 31 New Year Eve drunk driving checks drunk driving crackdown Cyberabad Cyberabad traffic advisory

మద్యం విక్రయాల విషయంలో కూడా ప్రత్యేక నియమాలు అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 31, 2026, జనవరి 1 వరకు మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు అర్ధరాత్రి 1 గంట వరకు తెరవబడతాయి. ఇన్-హౌస్ ఈవెంట్‌లు లేదా పర్మిట్‌లతో ఉన్న లైసెన్సుల కోసం మాత్రమే రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాన్ని అనుమతించారు. ఎక్సైజ్ శాఖ ఈ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కూడా నగర పోలీసులు పూర్తి దృష్టి పెట్టారు. డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. సాధారణంగా వీటిని వారం రోజులు రాత్రులలో నిర్వహిస్తుంటే.. నూతన సంవత్సర వేడుకల కారణంగా ఈ రోజు ప్రత్యేక ఫోకస్ ఉంది. నగరంలో ట్రాఫిక్ సురక్షితంగా కొనసాగేందుకు సిటీ పోలీసు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతాయి.

సీపీ సజ్జనార్‌ నగర పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపించడం, రోడ్లపై హడావుడి చేయడం, బాణాసంచాలు, కేక్‌ల ద్వారా శబ్ధ కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు పూర్తిగా నిషేధమని తెలిపారు. యువత రైడ్‌లలో ప్రమాదకర విన్యాసాలు, సైలెన్సర్లు తీసివేసి శబ్ధ కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో, తమ ఇళ్ల వద్ద జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం తాగిన వారికి ఉచిత రవాణా సేవలు అందించనున్నట్లు తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది. నేడు (డిసెంబర్‌ 31) రాత్రి 11 నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని తెలిపింది. ఇందుకోసం క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు కలిపి మొత్తం 500 వాహనాలను రెడీ చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో సేవలు అందిస్తామని.. కస్టమర్లు ఫ్రీ రైడ్ కోసం 8977009804 నంబర్‌కు కాల్‌ చేయాలని టీజీపీడబ్ల్యూయూ తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+