ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా కొత్త పన్ను విధానం మంచిదా లేదా పాత పన్ను విధానం మంచిదా అని ఆలోచిస్తుంటారు. కానీ కొత్త విధానాన్ని సెలెక్ట్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఎందుకంటే దీని కింద రూ.12 లక్షల వరకు ఆదాయం ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం కొత్త సిస్టం డిఫాల్ట్‌గా చేసింది, అంటే మీరు పాత సిస్టం సెలెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్'గా కొత్త సిస్టంలోకి వస్తారు. అయితే పన్ను చెల్లింపుదారులకు ఈ రెండు విధానాలలో దేనినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు గతంలో పాత సిస్టంలో ఉంటే, ఈసారి మీరు కొత్త సిస్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొత్త సిస్టం నుండి పాత సిస్టంలోకి మారవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలు ఆదాయపు పన్ను చట్టంలో ఉన్నాయి.

ఇప్పుడు మీరు పన్ను విధానాలను మార్చుకోవచ్చు, కానీ నియమాలు అన్ని పన్ను చెల్లింపుదారులకు ఒకేలా ఉండవు. ఉద్యోగులకు ఇంకా బిజినెస్ ఆదాయం ఉన్నవారికి నిబంధనలు వేరేలా ఉంటాయి. మీ ఆదాయం జీతం, వడ్డీ లేదా అద్దె నుండి వస్తే మీరు ప్రతి సంవత్సరం కొత్త లేదా పాత పన్ను విధానం మధ్య మారే అవకాశం ఉంది. దీని అర్థం మీరు గత సంవత్సరం కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ సంవత్సరం మీరు పాత పన్ను విధానానికి మారవచ్చు. అయితే ఈ నిర్ణయం ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందే తీసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, మీరు మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేస్తేనే పాత పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఒకవేళ వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్నవారికి పన్ను విధానాన్ని మార్చడానికి రూల్స్ కఠినంగా ఉంటాయి. అలంటి పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం పన్ను విధానాన్ని మార్చుకోలేరు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అంటే కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకున్నాక పాత పన్ను విధానానికి మారితే మళ్ళీ కొత్త విధానాన్ని సలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. పాత పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకున్న వారు ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఫారం 10-IEA ని నింపాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ ఫామ్ ఏ పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి మీరు అర్హులో కాదో తెలియజేస్తుంది.
ఐటీఆర్ గడువు : ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు 31 జూలై 2025 లోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి. ఎవరైనా గడువును దాటితే 31 డిసెంబర్ 2025 వరకు లేట్ రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు, కానీ లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పన్ను చెల్లింపుదారుడు ఐటీఆర్‌ను టైంకి ఫైల్ చేసి ఆ తర్వాత పన్ను విధానాన్ని మార్చుకోవాలని భావిస్తే సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే, గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి మాత్రమే ఈ అప్షన్ ఉంటుంది.
ఏ సిస్టం సెలెక్ట్ చేసుకోవాలి: ఉదాహరణకు, పాత పన్ను సిస్టంలో చాల రకాల మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. సెక్షన్ 80C (PPF, EPF, జీవిత బీమా), సెక్షన్ 80D (వైద్య బీమా), HRA (ఇంటి అద్దె భత్యం) వంటివి. అయితే, కొత్త విధానంలో అలాంటి ప్రయోజనాలు తక్కువగా ఉన్నాయి, కానీ రూ. 12 లక్షల ఆదాయం టాక్స్ ఫ్రీగా చేసింది. కాబట్టి ముందుగా మీరు ఏ విధానం మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుందో దానిని సెలెక్ట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications