భారత ఆర్థిక వ్యవస్థలో 2026 ఏప్రిల్ 1వ తేదీ ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలకబోతోంది. కార్మిక చట్టాల నుండి ఆదాయపు పన్ను నిబంధనల వరకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్స్ (New rules) అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ఉద్యోగి జీతం మీద, పన్ను చెల్లింపుల మీద, ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చే సెటిల్మెంట్ మీద నేరుగా ప్రభావం చూపుతాయి. ఆ మార్పులేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

మీ శాలరీ స్లిప్ మారుతోంది (New Wage Code)
ఇప్పటివరకు చాలా కంపెనీలు బేసిక్ పే (Basic Pay) తక్కువగా ఉంచి, అలవెన్సులు ఎక్కువగా ఇచ్చేవి. కానీ ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే 'కోడ్ ఆన్ వేజెస్ 2019' ప్రకారం, మీ మొత్తం సిటిసి (CTC)లో బేసిక్ పే కనీసం 50% ఉండాలి.
- ప్రభావం: బేసిక్ పే పెరగడం వల్ల మీ పీఎఫ్ (EPF) , గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది.
- టేక్ హోమ్ శాలరీ: పీఎఫ్ కటింగ్స్ పెరగడం వల్ల నెలకు చేతికి వచ్చే జీతం (Take-home pay) స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కానీ, రిటైర్మెంట్ సమయానికి మీ చేతిలో భారీ నిధి ఉంటుంది.
ఉద్యోగం మానేస్తే 2 రోజుల్లోనే సెటిల్మెంట్
ప్రస్తుతం ఉద్యోగం మానేసిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ (F&F) సెటిల్మెంట్ కోసం 30 నుండి 90 రోజుల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అయితే, సెక్షన్ 17(2) ప్రకారం కొత్త రూల్స్ (New rules) అమలులోకి వస్తే, మీరు రిజైన్ చేసినా లేదా కంపెనీ మిమ్మల్ని తొలగించినా.. మీ చివరి పని దినం నుండి కేవలం రెండు పని దినాల్లోనే (2 Working Days) మీ బకాయిలన్నీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు లభించే అతిపెద్ద ఉపశమనం.
65 ఏళ్ల పాత ఆదాయపు పన్ను చట్టం ఇక ఉండదు
1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో 'ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025' అమల్లోకి రానుంది.
- సరళీకరణ: 819 సెక్షన్ల నుండి చట్టాన్ని 536 సెక్షన్లకు తగ్గించారు. దీనివల్ల సామాన్యులకు పన్ను నిబంధనలు సులభంగా అర్థమవుతాయి.
- టాక్స్ ఇయర్: ఇకపై 'అసెస్మెంట్ ఇయర్' అనే కన్ఫ్యూజన్ ఉండదు. నేరుగా 'టాక్స్ ఇయర్ 2026-27' అని పిలుస్తారు. అంటే ఏ ఏడు సంపాదించిన డబ్బుకు ఆ ఏడాదే రిటర్న్స్ దాఖలు చేసినట్లు లెక్క.
విదేశీ ప్రయాణీకులకు ఊరట
విదేశీ టూర్ ప్యాకేజీలు , విదేశాల్లో విద్య, వైద్యం కోసం పంపే డబ్బుపై టీసీఎస్ (TCS) భారం తగ్గింది. గతంలో 7 లక్షల పైన 20% వరకు ఉన్న టీసీఎస్ రేటును ఏప్రిల్ 1 నుండి కేవలం 2% కి (ఫ్లాట్ రేట్) తగ్గించారు. దీనివల్ల విదేశాలకు వెళ్లేవారికి ముందస్తుగా చెల్లించాల్సిన టాక్స్ భారం తగ్గి, చేతిలో నగదు లభ్యత పెరుగుతుంది.
బంగారంపై పెట్టుబడుల పన్ను (SGB)
సోవరీన్ గోల్డ్ బాండ్స్ (SGB) ఇన్వెస్టర్లకు ఒక ముఖ్య గమనిక. ఏప్రిల్ 1 నుండి, నేరుగా ఆర్‌బీఐ (RBI) ద్వారా కొనుగోలు చేసిన బాండ్లకు మాత్రమే మెచ్యూరిటీ సమయంలో టాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెకండరీ మార్కెట్) నుండి కొనుగోలు చేస్తే, వచ్చే లాభాలపై 12.5% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications