New rules: బ్యాంకులో మీ డబ్బులు వేసినా నోటీసులా? ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే తిప్పలు తప్పవు!

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా అవసరం పడుతుందని బ్యాంకు నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేస్తారు. కానీ, ఆ పని అవ్వకపోవడమో లేదా ఆ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడమో జరిగితే.. తిరిగి ఆ డబ్బును బ్యాంకులో వేసేస్తారు. మన డబ్బు మనం డ్రా చేసి, మళ్ళీ మన అకౌంట్‌లోనే వేసుకుంటే తప్పేంటి అని అందరూ అనుకుంటారు. కానీ, ఇలా పదే పదే విత్‌డ్రా చేసి మళ్ళీ డిపాజిట్ చేయడం వల్ల మీరు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ (IT Department) నిఘాలో పడే అవకాశం ఉంది. తాజాగా ఇలాంటి ఒక విచిత్రమైన కేసులో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

New rules Income Tax Cash Deposit Withdrawal ITAT Court Verdict Purnima Das Case 2026

అసలేం జరిగింది? (ITO vs పూర్ణిమ దాస్ కేసు)

పూర్ణిమ దాస్ అనే ఒక మహిళ తన బ్యాంకు ఖాతా నుంచి వివిధ సమయాల్లో దాదాపు రూ. 15 లక్షల నగదును డ్రా చేశారు. అయితే, 2016 నోట్ల రద్దు (Demonetization) సమయంలో, ఆ డబ్బును మళ్ళీ తన ఖాతాలోనే డిపాజిట్ చేశారు. దీనిపై కన్నేసిన ఐటీ అధికారులు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె దగ్గర సరైన సమాధానం లేదని భావించి, ఆ మొత్తాన్ని 'అక్రమ ఆదాయం'గా పరిగణించి పన్ను విధించారు.

అధికారులు ఏమన్నారు?

ఆమె విచారణలో స్పష్టంగా ఒకటే విషయం చెప్పారు .. "నేను గతంలో బ్యాంకు నుంచి తీసిన డబ్బే ఇవి, కొత్తగా వచ్చిన ఆదాయం కాదు" అని. దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు కూడా చూపించారు. కానీ, ఐటీ అధికారి మాత్రం వింత వాదన చేశారు. "సాధారణంగా ఏ మనిషీ కూడా అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకుండా లేదా ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో దాచుకోరు. ఇది 'హ్యూమన్ ప్రాబబిలిటీ' (మానవ సహజ ప్రవర్తన) కి విరుద్ధం" అని చెబుతూ ఆ డబ్బును బ్లాక్ మనీగా తేల్చేశారు.

ఐటీఏటీ ఇచ్చిన సంచలన తీర్పు

ఈ కేసును విచారించిన ఐటీఏటీ (ITAT), అధికారుల తీరును తప్పుబట్టింది. కేవలం ఊహల మీద లేదా అనుమానాల మీద పౌరులపై పన్నులు వేయకూడదని స్పష్టం చేసింది.

  • సాక్ష్యం ఉంటే సరిపోతుంది: ఒక వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసినట్లు ఆధారాలు ఉండి, ఆ డబ్బు ఖర్చు చేసినట్లు ఆధారాలు లేనప్పుడు.. తిరిగి ఆ డబ్బును బ్యాంకులో వేస్తే దాన్ని అక్రమ ఆదాయంగా చూడలేం.
  • వింతగా అనిపించినా సరే: సదరు వ్యక్తి చెప్పే వివరణ అధికారులకు వింతగా లేదా నమ్మశక్యంగా లేకపోయినా, అది తప్పు అని నిరూపించడానికి అధికారుల వద్ద బలమైన సాక్ష్యం ఉండాలి.
  • నిరూపించాల్సిన బాధ్యత: ఆ డబ్బు అక్రమమైనదని నిరూపించాల్సిన బాధ్యత ఐటీ శాఖదే తప్ప, పన్ను చెల్లింపుదారుడిది కాదు.

కొత్తగా వచ్చిన మార్పులు & జాగ్రత్తలు

కొత్త నిబంధనల (New rules) ప్రకారం, మీరు మీ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసి తిరిగి డిపాజిట్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా 2026 నాటి ఆర్థిక పరిస్థితుల్లో, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో భారీ నగదు లావాదేవీలు జరిగితే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావడం సహజం. మీరు డబ్బు డ్రా చేసినప్పుడు ఆ పర్పస్ ఏంటి, ఎందుకు మళ్ళీ డిపాజిట్ చేశారో చెప్పడానికి బ్యాంకు స్టేట్‌మెంట్లను భద్రపరుచుకోవాలి.

ఈ తీర్పుతో వేలాది మందికి ఊరట లభించినప్పటికీ, సామాన్యులు తమ నగదు లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. అనవసరంగా డబ్బులు డ్రా చేయడం, మళ్ళీ జమ చేయడం లాంటివి చేస్తే అనవసరమైన లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+