న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన వ్యవస్థను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత సరళతరం చేసింది. ట్యాక్స్‌పేయర్స్ ఫ్రెండ్లీ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఇందులో భాగంగా కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు రూపకల్పన చేసింది. ప్రస్తుతం ఇది తుది మెరుగులను దిద్దుకుంటోంది. జూన్ 7వ తేదీన ఈ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను వినియోగంలోకి తీసుకుని రానుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ పోర్టల్‌పై తాజా సమాచారాన్ని ఆదాయపు పన్నుశాఖ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు మరింత సరళతరంగా ఉంటుందని తెలిపింది. కొత్తగా ఇందులో పొందుపరిచిన ఫీచర్లు మరింత ఫ్రెండ్లీగా ఉండబోతోన్నాయని స్పష్టం చేసింది. పన్నుచెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను దాఖలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా దీన్ని రూపొందించినట్లు సీబీడీటీ తెలిపింది.

తమ ఐటీ మొత్తాన్ని వెంటనే రీఫండ్ చేసేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. సింగిల్ డాష్‌బోర్డ్ మీదే అన్ని రకాల అప్‌లోడ్స్, పెండింగ్స్ తెలుసుకునే వీలు ఈ కొత్త పోర్టల్‌లో ఉంటుందని వివరించింది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ, ఇతర మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్లను ఇందులో పొందుపరిచామని, దీనివల్ల ట్యాక్స్‌పేయర్లు త్వరితగతిన తమ అకౌంట్లను చెక్ చేసుకునే వీలు ఉందని వెల్లడించింది. ఈ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 7వ తేదీన అందుబాటులోకి వస్తుందని సీబీడీటీ పేర్కొంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications