ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ శని, ఆదివారాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడటం అలవాటే. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అదే నాలుగు పని దినాల (4 working days) సదుపాయం. అవును, మీరు విన్నది నిజమే! త్వరలో అమలులోకి రానున్న 'కొత్త లేబర్ కోడ్' (New Labour Code) లో ఉద్యోగుల పని వేళల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. దీని వల్ల మీరు వారంలో 4 రోజులు కష్టపడితే.. మిగిలిన 3 రోజులు హ్యాపీగా టూర్లకు వెళ్లొచ్చు లేదా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవచ్చు. అసలు ఈ ప్లాన్ ఏంటి? ఇందులో ఉన్న ట్విస్టులేంటో ఇప్పుడు చూద్దాం.

48 గంటల నిబంధన.. ఎలా పనిచేస్తుంది?
కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసిన దాని ప్రకారం.. ఒక ఉద్యోగి వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాలి. అయితే.. ఈ 48 గంటలను మీరు ఎలా పూర్తి చేస్తారు అనేది మీ ఇష్టం. లేదా మీ కంపెనీతో కుదుర్చుకునే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.
- ఆప్షన్ 1: మీరు రోజుకు 12 గంటల చొప్పున పని చేస్తే.. కేవలం 4 రోజుల్లోనే 48 గంటలు పూర్తవుతాయి. అప్పుడు మీకు వారంలో 4 రోజులు (4 working days) పని చేసినట్టు. మిగతా 3 రోజులు సెలవు తీసుకోవచ్చు.
- ఆప్షన్ 2: లేదు మేము 12 గంటలు పని చేయలేము అనుకుంటే.. రోజుకు 10 గంటల చొప్పున 5 రోజులు పని చేయవచ్చు. అప్పుడు 2 రోజులు సెలవు వస్తుంది.
- ఆప్షన్ 3: ఎప్పటిలాగే రోజుకు 8 గంటలు పని చేస్తే మాత్రం వారానికి 6 రోజులు ఆఫీస్ కు వెళ్లాల్సిందే. కేవలం ఒక్క రోజే సెలవు దొరుకుతుంది.
Zepto IPO: రూ. 4,500 కోట్ల భారీ IPOతో వస్తున్న Zepto! ఇన్వెస్టర్లకు పండగే! మీరేం చేయాలంటే..
ఎక్స్‌ట్రా పని చేస్తే డబుల్ శాలరీ
కొన్నిసార్లు కంపెనీల్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్ టైమ్ (OT) చేయాల్సి వస్తుంది. కొత్త చట్టం ప్రకారం.. ఒకవేళ కంపెనీ మిమ్మల్ని నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సేపు పని చేయించుకుంటే మీకు సాధారణ జీతం కంటే రెండు రెట్లు (Double Salary) ఓవర్ టైమ్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఫ్లెక్సిబిలిటీ.. ఎవరి చేతిలో ఉంటుంది?
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నాలుగు రోజుల (4 working days) ఆప్షన్ కావాలా? వద్దా? అనేది కేవలం ఉద్యోగి మాత్రమే నిర్ణయించుకోలేరు. కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలి. ఐటీ కంపెనీలు, తయారీ రంగ సంస్థలకు ఇది బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా 3 రోజులు సెలవు వస్తే ఉద్యోగులు రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఉత్సాహంగా పని చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం
ప్రపంచ దేశాలైన బెల్జియం, యూకే వంటి చోట్ల ఇప్పటికే ఈ 'ఫోర్ డే వర్క్ వీక్' (4-Day Work Week) ప్రయోగాత్మకంగా నడుస్తోంది. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని తేలింది. భారతదేశంలో కూడా ఇది అమలులోకి వస్తే, ముఖ్యంగా యువతకు తమ వ్యక్తిగత జీవితానికి (Work-Life Balance) ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications