ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చాయి. ఆదాయపన్ను పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోగాని లేదా పాత విధానంలోగాని పన్ను చెల్లించవచ్చని కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త విధానంలో ప్రభుత్వం పన్ను శ్లాబులను తగ్గించింది. పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంచుకుంటే.. సెక్షన్ 80సీ కింద ఇప్పటివరకు అమలులో ఉన్న పన్ను మినహాయింపులను వదలుకోవలసి ఉంటుంది.

వాటికి మినహాయింపు ఉండదు...
ఈ ఆదాయపన్ను నూతన విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్(ఎల్‌టీఏ), గృహ రుణాలపై చెల్లించే వడ్డీ వంటి వాటిని పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం నుంచి మినహాయించుకోవడానికి వీలుపడదు. అంటే పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంచుకుంటే.. సెక్షన్ 80సీ కింద ఇప్పటివరకు అమలులో ఉన్న పన్ను మినహాయింపులను ఇక మీదట క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట.

ఇన్వెస్టర్‌పై డివిడెండ్ ట్యాక్స్ భారం...
ఆదాయపన్ను నూతన విధానాన్ని ఎంచుకునే వారు.. మ్యూచువల్ ఫండ్స్ లేదా డొమెస్టిక్ కంపెనీల నుంచి తీసుకునే డివిడెండ్‌పై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై డివిడెండ్ పొందితే వీటిపై పన్నును తన పన్ను శ్లాబుకు తగ్గట్టు ఇన్వెస్టరే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ పన్నును మ్యుచువల్ ఫండ్స్, కంపెనీలే చెల్లించేవి. ఇప్పుడు కొత్త విధానం వలన హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్స్‌లో ఉన్న వారిపై పన్ను భారం అధికంగానే ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ డివిడెండ్ల రూపంలో రూ. 5,000 కు పైగా పొందితే, 10 శాతం టీడీఎస్(మూలం వద్ద పన్ను చెల్లింపు) ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ కూడా...
ఏడాదిలో ఎన్‌పీఎస్, సూపర్ యాన్యూషన్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లలో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ రూ. 7.5 లక్షలు దాటితే, ఆ మొత్తంపై పన్నును ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కొత్త, పాత పాన్ను విధానాలలోనూ అమలవుతుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికి ఉద్యోగి ఎన్‌పీఎస్‌లో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. జీతంలో గరిష్టంగా 10 శాతం(బేసిక్ + డీఏ) వరకు మినహాయింపు కోరవచ్చు. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయితే గరిష్టంగా 14 శాతం వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు.

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట...
అయితే యంగ్, సీనియర్ సిటిజన్ ట్యాక్స్ పేయర్లు.. ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త విధానాన్ని ఎంచుకోవడమే మంచిదని వ్యక్తిగత ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం కారణంగా పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. తక్కువ మొత్తం ఉన్న అన్ని విత్ హోల్డింగ్ పన్ను ఆదేశాల చెల్లుబాటును మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సున్నా లేదా తక్కువ టీడీఎస్, టీసీఎస్‌ల దరఖాస్తులు పెండింగులో ఉంటే జూన్ 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications