ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఆయా దేశాలను కకలావికలం చేస్తోంది. భారత్‌లోను ఆర్థిక మందగమన భారీగానే ఉంది. మందగమనం కారణంగా ఆయా రంగాలలో వృద్ధి క్షీణించింది. దీంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూములులేని వారు పని లేక ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాన ఆహార పదార్థాలను తగ్గిస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే ఫుడ్ సేఫ్టీ నెట్ వర్క్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ఉద్యోగుల పథకానికి ఎక్కువ నిధులు, సత్వర చెల్లింపులు ఉండాలని అంటున్నారు.

తిండి కోసం కష్టాలు
గ్రామాల్లో భూమి వంటి ఏ ఆధారం లేని కార్మికుల పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నారు. తిండిని ఆదా చేయడం కోసం ఓ పూట కూడా మానుకునే పరిస్థితిలు ఉన్నాయని, ఓ కార్మికుడు పని చేస్తే రోజుకు రూ.100 వస్తున్నాయని, కొన్ని సమయాల్లో ఆ పని కూడా దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నారని, ఇంట్లోని చిన్న పిల్లలకు కూడా సరైన ఆహారం పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయట. ఈ మేరకు ఓ ఇంగ్లీష్ ఛానల్ వివిధ రాష్ట్రాల్లోని ఆందోళనకర పరిస్థితిని వివరించింది.

తగ్గిన వినిమయశక్తి
దేశంలో గత కొంతకాలంగా వినిమయశక్తి తగ్గుతోంది. భూములు లేని పేదలు, కేవలం క్యాజువల్ పని పైనే ఆధారపడిన వారు ఫుడ్‌ను స్టాక్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తేలిందట. గ్రామీణ ఆదాయం భారీగా పతనమైంది. క్యాజువల్ వేతనాల గ్రోత్ పెరగడం లేదు. దీంతో వినిమయశక్తి తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన డేటా ప్రకారం నిరుద్యోగిత 2017-18లో నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. 15-29 మధ్య వయస్సు కలిగిన గ్రామీణ పురుషుల్లో 17 శాతం మందికి ఉద్యోగం లేదా ఉపాది లేకుండా పోయింది. 2011-12లో కంటే ఇది మూడు రెట్లు.

వినిమయశక్తి లేక.. మారిన ఆహారపు అలవాటు
ఓ వైపు ఆదాయాలు పడిపోతుంటే మరోవైపు ఆహార ధరలు పెరుగుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో భూములులేని వారు తమ ఆహార అలవాట్లను మార్చుకునే పరిస్థితి వచ్చిందట. కొంతమంది ఆహారంలో స్థానికంగా దొరికే ఆకుకూరలు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ ఆహార వస్తువులతో పాటు ఇలాంటివి కూడా వారిని ఆకలి నుంచి కాపాడుతున్నాయి. కొందరు తమ భోజనాన్ని ఏకంగా మధ్యాహ్నం తింటున్నారు. ఆదా చేసేందుకు వారు ఇలా చేస్తున్నారట.

ఉద్యోగాలు లేవు
చాలామందికి ఉద్యోగాలు లేదా ఉపాది లేకుండా పోయింది. ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం కింద ఇచ్చిన ఉపాధి అనుకున్న మేర ఉపాధి కల్పించలేకపోయింది. ఒకవేళ పని దొరికినా కొన్ని ప్రాంతాల్లో కొద్ది నెలలుగా వేతనాలు రావడం లేదట.

ఆధార్ ఫ్యాక్టర్
అవినీతి, అక్రమాలను రూపుమాపేందుకు ఆధార్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతున్నప్పటికీ వీటి వల్ల కూడా వారు ఇబ్బంది పడుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఆహార పదార్థాలు తీసుకోవాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి. కొన్ని సందర్భాలలో కరెంట్ పోవడం వల్ల వారు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఓ ప్రాంతంలో కరెంట్ లేకపోతే, మరో ప్రాంతంలో ఇంటర్నెట్ స్లోగా ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications