కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఒక్కో చోట ఒక్కో రూల్స్ చెప్తుంటారు. కొంతమంది ఎక్కువ అడ్వాన్స్ అడుగుతారు. మరికొందరు ఉన్నట్టుండి అద్దె పెంచుతారు. ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొనే ఉంటారు. అయితే వీటిపై స్పష్టత వచ్చేలా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదే టెనెన్సీ యాక్ట్ 2025(Model Tenancy Act) ఈ యాక్ట్ ప్రకారం చాలా రూల్స్ మారబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొత్తగా అద్దె ఇంటికి వెళ్తున్నప్పుడు, మనం ఎంత డిపాజిట్ కట్టాలి? అద్దె ఎప్పుడు పెరుగుతుంది? అసలు రెంట్ అగ్రిమెంట్ తీసుకోవాలా వద్దా? ఈ విషయాలన్నీ ముందే స్పష్టంగా తెలిస్తే ఎంత బాగుంటుంది? ఎలాంటి గందరగోళం ఉండదు కదా.. అందుకే అలాంటి స్పష్టత కోసమే భారత ప్రభుత్వం కొత్త టెనెన్సీ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ద్వారా ఇంటి యజమానులకు, అద్దెకు తీసుకునే వారికి.. ఇద్దరికీ ఇంకా స్పష్టంగా కొన్ని నియమాలు వర్తించనున్నాయి.
రూల్స్ ఎందుకు మారాయంటే..
ఇన్నాళ్లు మన దేశంలో ఇంటి అద్దె లావాదేవీలు ఎక్కువగా నోటి మాట మీద లేదా చిన్న చిన్న కాగితపు ఒప్పందాల మీద నడిచేవి. అందుకే డిపాజిట్లు, అద్దె పెంపులు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉండేవి. ఎవరి హక్కులు ఏంటో చాలా మందికి పూర్తిగా తెలిసేవి కాదు. అయితే ఈ కొత్త నియమాలు ద్వారా అద్దెకు సంబంధించిన విషయాలన్నీ కచ్చితమైన, పారదర్శకమైన పద్ధతిలోకి మారతాయి. ముఖ్యంగా నగరాల్లో అద్దె ఇళ్లపై ఆధారపడే కోట్లాది మందికి ఈ స్పష్టమైన రూల్స్ చాలా ఉపయోగపడతాయి.
అద్దెదారులకు బెనిఫిట్స్ ఇవే..
ఈ కొత్త రూల్స్‌లో ఇల్లు అద్దెకు తీసుకునేవారికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.
- రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఇకపై అద్దె దారులు వాళ్ల రెంట్ అగ్రిమెంట్ ను రెండు నెలల్లోపు దాన్ని స్థానిక రెంట్ అథారిటీ దగ్గర నమోదు చేయాలి. దీనివల్ల మీ ఒప్పందానికి ప్రభుత్వపరంగా రక్షణ లభిస్తుంది.
- డిపాజిట్ తగ్గింపు: రెసిడెన్షియల్ ఇళ్లకు సెక్యూరిటీ డిపాజిట్ రెండు నెలల అద్దెకు మించకూడదు. దీనివల్ల కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకునేవారిపై ఆర్థిక భారం తగ్గుతుంది.
- అద్దె పెంచితే ముందే చెప్పాలి: కొత్త రూల్స్ ప్రకారం అద్దె ఎప్పుడు, ఎంత పెంచుతారో యజమానులు ముందే మీకు చెప్పాలి. దానికి సంబంధించిన నోటీసు ముందే ఇవ్వాలి. దీనివల్ల అద్దెదారులు నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుంది.
- ఇల్లు ఖాళీ చేయించాలంటే కచ్చితమైన కారణం ఉండాలి: ఇకపై అద్దెదారులను అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమని యజమానులు అడగలేరు. ఖాళీ చేయించాలంటే చట్టం ప్రకారం సరైన పద్ధతిని పాటించాలి. అలాగే కచ్చితమైన కారణం ఉండాలి.
- సమస్యలు త్వరగా పరిష్కారం: ఇకపోతే అద్దెకు సంబంధించిన గొడవలు వస్తే వాటిని పరిష్కరించేందుకు రెంట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. అక్కడ 60 రోజుల్లోపు సమస్య పరిష్కరించబడుతుంది.
యజమానులకు ఉండే బెనిఫిట్స్
- పన్ను మినహాయింపు: కొత్త రూల్స్ వల్ల ఇంటి యజమానలకు కొన్ని పన్ను మినహాయింపులు ఉంటాయి. అద్దె ఆదాయంపై TDS పరిమితిని ఏడాదికి రూ.2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచారు. దీనివల్ల యజమానుల చేతికి త్వరగా డబ్బు అందుతుంది.
- పన్ను రిపోర్టింగ్: ఏప్రిల్ 2025 నుంచి అద్దె ఆదాయాన్ని సొంత ఆస్తి నుంచి వచ్చే ఆదాయం కింద చూపడం మరింత సులభం అవుతుంది.
- అద్దె కట్టకపోతే: ఎవరైనా అద్దెదారులు ఏడాదిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలలు అద్దె కట్టకపోతే, ఆ సమస్యను వేగంగా పరిష్కరించడానికి యజమానులు ట్రిబ్యునల్‌కు వెళ్లొచ్చు.
- పన్ను రాయితీలు: తక్కువ అద్దె తీసుకునేవారికి ఇంట్లో సోలార్ పవర్ వంటి ఏర్పాట్లు చేసిన వారికి ప్రభుత్వ పథకాల కింద పన్ను తగ్గింపులు లభించవచ్చు.
ఇలా చేస్తే బెటర్
ఇకపై అద్దెదారులు రెంట్ అగ్రిమెంట్ పై డిజిటల్‌గా స్టాంప్ చేసి, నమోదు చేయబడిందో లేదో చూసుకోవాలి. అద్దె, డిపాజిట్ అమౌంట్.. మిగతా నిబంధనలు అన్నీ స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.ఇంటి యజమానులు ప్రభుత్వంచే ఆమోదించబడిన ఇ-స్టాంపింగ్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలి. కొత్త రూల్స్ ను పూర్తిగా తెలుసుకోవాలి. ఇకపోతే యజమానులు, అద్దెదారులు ఇద్దరూ ఒప్పందంపై సంతకం చేసే ముందు అన్ని నిబంధనల గురించి ఒకరితో ఒకరు వివరంగా మాట్లాడుకోవాలి.
More From GoodReturns

Tax Regime: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్.. ఎంత ఆదాయం వరకు పన్ను కట్టక్కర్లేదు?

Layoffs: ఇంట్లో రివర్స్ రోల్స్.. సంపాదించే పిల్లలు.. ఆధారపడే తల్లిదండ్రులు! భారత్‌లో కొత్త ట్రెండ్!

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

గుడ్ న్యూస్: ఇకపై రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్.. కొత్త రూల్స్ తెలుసుకోండి!

హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50% హెచ్ఆర్ఏ మినహాయింపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications