ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. అడ్వాన్స్ టాక్స్, టీడీఎస్ వసూళ్లు ఇందుకు ఉపకరించాయి. ఏప్రిల్ 1వ తేదీ - సెప్టెంబర్ 22వ తేదీ మధ్య కాలంలో రూ.5,70,568 కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని సీబీడీటీ వెల్లడించింది. నికర ప్రత్యక్ష పన్నులు (మొత్తం స్థూల సేకరణ నుండి రీఫండ్స్ తీసివేశాక) సెప్టెంబర్ 22 నాటికి ఈ మొత్తం వసూలయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సేకరించిన రూ.3.27 లక్షల కోట్ల కంటే ఇది 74.4 శాతం అధికమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఓ ప్రకటనలో వెల్లడించింది. 2019-20లో సేకరించిన రూ.4.48 లక్షల కోట్ల కంటే కూడా 27 శాతం అధికమని తెలిపింది. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.6.45 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. ఇది 47 శాతం వృద్ధి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.4.39 లక్షల కోట్లు నమోదయ్యాయి.

గ్రాస్ కలెక్షన్స్ 16.75 శాతం పెరిగి రూ.5.53 లక్షల కోట్లకు పెరిగాయి. అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా రూ.2.53 లక్షల కోట్లు వసూలయ్యాయి. టీడీఎస్ రూ.3.19 లక్షల కోట్లకు పైగా ఉంది. సెల్ఫ్ అసెస్మెంట్ వర్త్ రూ.41,739 కోట్లుగా ఉంది. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ.25,558 కోట్లు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రూ.4,406 కోట్లు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications