Imports: పొరుగు దేశం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం అక్కడి వ్యాపారుల ఆగ్రహానికి కారణమైంది. దిగుమతులపై 13 శాతం విలువ ఆధారిత పన్ను(VAT) విధిస్తూ సర్కారు తీర్మానించింది. దీంతో భారత్ నుంచి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇతర కూరగాయల దిగుమతులు నిలిపివేస్తున్నట్లు నేపాల్ ట్రేడర్స్ తెలిపారు.
నేపాల్ ప్రభుత్వ చర్యను అక్కడి ప్రతిపక్షాలు విమర్శించాయి. తక్కువ ఆదాయ వర్గాల ఆహార భద్రతను ఇది ప్రశ్నార్థకంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజల వేదనను ఈ చర్య మరింత పెంచుతుందని వాదిస్తున్నారు. మే 29న పార్లమెంటులో ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆర్థిక మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్ ఈ చర్యను సమర్థించారు. స్థానిక రైతులను ఆదుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది భారత్ నుంచి దాదాపు లక్షా 74 వేల టన్నుల ఉల్లిపాయలను నేపాల్ దిగుమతి చేసుకుంది. స్థానిక డిమాండ్‌లో 60 శాతం బంగాళాదుంపలను అక్కడే పండిస్తుండగా.. మిగిలినవి భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఉల్లిపాయల కోసం నేపాల్ దాదాపు పూర్తిగా భారతదేశంపై ఆధారపడి ఉన్నందున.. స్థానిక రైతుల కోసం వ్యాట్ అమలు చేస్తున్నామన్న ఆర్థిక మంత్రి వాదనలో అర్థం లేదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. "వ్యాట్ ప్రవేశపెట్టడానికి ముందు ఖాట్మండు వ్యాలీలో రోజూ వెయ్యి టన్నుల ఉల్లిపాయలు ఇండియా నుంచి దిగుమతి అయ్యేవి" అని స్థానిక టోకు వ్యాపారి చెప్పారు. గత 10 రోజులుగా ఉల్లి రావడం ఆగిపోయిందని వెల్లడించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications