NEFT News: ఫిబ్రవరి 29న చరిత్ర సృష్టించిన NEFT.. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద రికార్డ్
Payments News: సులభతర చెల్లింపుల కోసం మోదీ సర్కారు దేశంలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టింది. దీనికి ప్రజాదరణ పెరగడంతో ఈ సర్వీసును ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో విరివిగా వినియోగించిన పేమెంట్ సిస్టమ్ తాజాగా ఓ భారీ హిట్ కొట్టింది. అనుకోని అతిథిలా దూసుకొచ్చింది.
UPI ప్రవేశానికి ముందు అత్యంత విరివిగా ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT)ను చెప్పుకోవచ్చు. అయితే కొత్త పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో క్రమేపీ పాత వ్యవస్థ పేరు ప్రజల్లో మసకబారింది. అయితే ఫిబ్రవరి 29న ఈ సిస్టమ్ ఓ సరికొత్త రికార్డు సృష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

లీప్ డే రోజున NEFT 4.10 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. తద్వారా ఇప్పటివరకు ఒక రోజులో అత్యధిక పేమెంట్స్ జరిపిన దినంగా ఫిబ్రవరి 29 NEFT చరిత్రలో నిలిచిపోయింది. ఈ మేరకు ఖచ్చితంగా 4 కోట్ల 10 లక్షల 61 వేల 337 లావాదేవీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. కాగా RTGS వ్యవస్థ గతేడాది మార్చి 31న ఒక రోజులో అత్యధికంగా 16.25 లక్షల లావాదేవీలను ప్రాసెస్ చేసింది.
గత పదేళ్లలో 2014 నుంచి 2023 మధ్య నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) మరియు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS)సిస్టమ్స్ వాల్యూమ్ పరంగా వరుసగా 700 శాతం మరియు 200 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక విలువలో చూస్తే ఈ గణాంకాలు వరుసగా 670 శాతం మరియు 104 శాతంగా రిజర్వ్ బ్యాంక్ డేటా చెబుతోంది. రిటైల్ మరియు టోకు చెల్లింపులను పరిష్కరించడానికి NEFT మరియు RTGS వ్యవస్థలను RBI నిర్వహిస్తుంది .


Click it and Unblock the Notifications