స్థిరమైన వృద్ధికి హెల్త్ కేర్, మౌలిక సదుపాయాల రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం అన్నారు. ఇన్‌ప్రా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు తోడు కార్మిక మరియు ఉత్పత్తి మార్కెట్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి నుండి వేగంగా కోలుకొని, స్థిరమైన వృద్ధిని సాధించడానికి పై అంశాలు కీలకమని చెప్పారు. శక్తికాంత దాస్ బుధవారం AIMA నేషనల్ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్ కార్యక్రమంలో మాట్లాడారు.
హెల్త్ కేర్ ఎడ్యుకేషన్, డిజిటల్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెరగాలన్నారు. పెట్టుబడులు భారీగా పెరిగితేనే స్థిరమైన వృద్ధి నమోదవుతుందని, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదలు, బలహీనుల పైన కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మహమ్మారి తర్వాత భవిష్యత్తు అందరికీ అనుకూలంగా, స్థిరమైన వృద్ధికి ఆస్కారం ఉండేలా మన ప్రయత్నాలు ఉండాలన్నారు. ప్రయివేటు వినియోగం మన్నికను పునరుద్ధరించడం అవసరమన్నారు. స్థిరమైన వృద్ధి అనేది మధ్యకాలిక పెట్టుబడులు, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా స్థిరమైన వృద్ధి అవసరమన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications