అప్పు పెరిగింది... మిల్లీనియల్స్‌కు కరోనా కష్టాలు: కారు లేదా ఇల్లు టార్గెట్
ముంబై: కరోనా కారణంగా దాదాపు సగం మంది మిల్లీనియల్స్ రుణాలు పెరిగినట్లు బ్రిటిష్ బ్యాంకు స్టాండర్డ్ చార్టర్డ్ సర్వేలో వెల్లడైంది. ఆగస్ట్ - సెప్టెంబర్ కాలంలో మిల్లీనియల్స్ గతంలో కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. 1981 తర్వాత జన్మించినవారిని మిల్లీనియల్స్‌గా చెబుతారు. వీరికి రోజువారీ ఖర్చు కూడా భారంగా మారిందట. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా, భారత దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు పోయాయని తెలిపింది. ముఖ్యంగా వ్యవస్థీకృత విభాగంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ కారణంగా భారీగా ఉద్యోగ నష్టం జరిగిందని, అయితే అన్-లాక్ తర్వాత కాస్త కోలుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు గతంలో వేసిన భారీ పతనం కంటే కాస్త తక్కువ ప్రభావం ఉండనుందని తేలింది.

అప్పులు పెరిగాయి
స్టాండర్డ్ చార్ట్ భారత్ సహా 12 దేశాల్లో 12,000 మందితో ఈ సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ మధ్య సర్వే చేసింది. ఈ కాలంలో తమ రుణాలు పెరిగినట్లు 44 శాతం మంది ఇండియన్ మిల్లీనియల్స్ చెప్పారు. అదే సమయంలో 45 ఏళ్లకు పైబడిన వారు 28 శాతం మంది మాత్రమే రుణభారం పెరిగినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత మనీ మేనేజ్‌మెంట్ ఇబ్బందికరంగా మారిందని ప్రపంచవ్యాప్తంగా 64 శాతం మంది చెప్పగా, భారత్‌లో మూడొంతుల మంది చెప్పారు.

ఆర్థిక మేలుకొలుపు
కరోనా వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయని సర్వే నిర్వహించిన స్టాండర్డ్ చార్ట్ బ్యాంకు తెలిపింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి సంఘటిత రంగంలో ఎక్కువమంది ఉపాధిని కోల్పోయారని వెల్లడించింది. అయితే ఇప్పుడిప్పుడు అన్-లాక్ నేపథ్యంలో పరిస్థితులు కుదుటపడుతున్నట్లు తెలిపింది. జీడీపీ అంచనాలూ క్రమంగా మెరుగు అవుతున్నాయని పేర్కొంది. మిల్లీనియల్స్‌కు కరోనా ఓ ఆర్థిక మేల్కొలుపుగా భావించవచ్చునని, ద్రవ్యపరమైన అంశా ల్లో అవగాహన పెరుగుతోందని, దీర్ఘకాలిక పొదుపు, ఖర్చులపై జాగ్రత్త, పెట్టుబడులపై ఆసక్తి కనిపిస్తోందని తెలిపింది.

కారు లేదా ఇల్లు కోసం..
భారత్‌లో దాదాపు సగం మంది (48 శాతం) మిల్లీనియల్స్ కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు కోసం ఆదా చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 48 ఏళ్లకు పైబడిన వారు ఇదే లక్ష్యంతో 28 శాతం ఉన్నారు. మిల్లీనియల్స్‌లో 39 శాతం మంది పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన వారిలో 26 శాతం మంది మాత్రమే పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications