GoFirst: అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకుని తిరిగి గాల్లోకి ఎగిరేందుకు గోఫస్ట్ ఇన్నిరోజులు చేసిన ప్రయత్నాలకు ఎన్సీఎల్టీ ఊతం ఇచ్చింది. తాజా తీర్పుపై CEO కౌశిక్ ఖోనా హర్షం వ్యక్తం చేశారు. తాము కోరుకున్న ఉత్తమమైనదే జరిగిందని సీఈవో అన్నారు.
దేశంలోని నాల్గవ అతిపెద్ద క్యారియర్ అయిన గో ఫస్ట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నుంచి ఉపశమనం పొందింది. అయితే దివాలా పరిష్కారం కోసం అబ్లియాష్ లాల్‌ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా నియమించింది. NCLT ఢిల్లీ బెంచ్ కూడా లీజర్లు, రుణదాతలు రికవరీ నుంచి మారటోరియం కింద గోఫస్ట్ రక్షణను మంజూరు చేసింది.

కంపెనీ తన ట్విట్టర్ ద్వారా అందించిన వివరాల ప్రకారం ఈనెల 19 వరకు ఆపరేటింగ్ కారణాల వల్ల విమానాలను రన్ చేయలేకపోతున్నట్లు వెల్లడించింది. తీర్పును వెలువరించిన ట్రిబ్యునల్ గోఫస్ట్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించకుండా తప్పక చూసుకోవాలని అభిలాష్ లాల్‌కు నిర్థేశించింది. ఇది ఉద్యోగులకు పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి.
గోఫస్ట్ కంపెనీకి మధ్యంతర మారటోరియం కల్పించటం చాలా హానికరమైన నిర్ణయమని, ఇది సమీప భవిష్యత్తులో తీవ్రమైన పర్యవసానాలకు దారితీస్తుందని లీజుదారులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో గోఫస్ట్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. మరోపక్క అమెరికాకు చెందిన ఇంజిన్ తయారీదారు ప్రాట్ & విట్నీ విడి ఇంజిన్ల సరఫరా కోసం గో ఎయిర్‌లైన్స్ (ఇండియా) లిమిటెడ్‌కు వ్యతిరేకంగా మధ్యవర్తిత్వ తీర్పును అమలు చేయడాన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉందని లావేర్ కోర్టు ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది.
దీనికి ముందు మార్చి 30న గో ఫస్ట్‌కు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనుకూలంగా తీర్పు వెలువరించింది. అత్యవసరంగా ఇంజిన్లు సరఫరా చేయకపోతే కంపెనీ కోలుకోలేని పరిస్థితులు ఎదుర్కోవచ్చని వెల్లడిస్తూ.. ప్రాట్ & విట్నీని 28 రోజులలోపు కనీసం 10 సర్వీసబుల్ స్పేర్ ఇంజన్‌లను, ఏడాది చివరి వరకు ప్రతి నెలా మరో 10 ఇంజిన్లను అందించాలని తెలిపింది.


Click it and Unblock the Notifications