టవర్, ఫైబర్ వ్యాపారాన్ని రెండు వేర్వేర యూనిట్లుగా విభజించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అనుమతులు ఇవ్వడంపై ఆదాయపు పన్ను శాఖ విభాగం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT)లో పిటిషన్ వేసింది. అయితే ఈ అంశంపై జియోకు ఊరట లభించింది. ఐటీ విభాగం వేసిన పిటిషన్‌ను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.
వ్యాపారాన్ని విభజించి జియో డిజిటల్ ఫైబర్ ప్రయివేటు లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రయివేటు లిమిటెడ్‌గా చేసేందుకు NCLT అహ్మదాబాద్ బెంచ్ గతంలో ఆమోదం తెలిపింది. దీనిపై ఐటీ విభాగం ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. ట్రైబ్యునల్ ఆమోదించిన స్కీం ఆఫ్ అరేంజ్‌మెంట్‌లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

రిలయన్స్ నిర్ణయంతో కంపెనీ పన్ను చెల్లింపు ఆదాయం తగ్గుతుందని ఐటీ శాఖ వాదన. డీమెర్జర్ స్కీమ్ ప్రకారం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుందని, ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకమని, అంతేకాదు బదిలీ కంపెనీ (జియో ఇన్ఫోకామ్) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుందని, ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుందని ఐటీ శాఖ వాదించింది. అయితే ఈ వాదనను NCLT అహ్మదాబాద్ బెంచ్ ఇదివరకు కొట్టి వేసింది. ఇప్పుడు NCLAT పిటిషన్‌ను తోసిపుచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications