జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితపై ఈడీ మనీ లాండరింగ్ (PMLA) కింద కేసు నమోదు చేశారు. గతంలో FDI నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫెమా కింద ఈడీ అధికారులు గోయల్‌ను ప్రశ్నించారు. తాజాగా ముంబైలోని ఓ ట్రావెల్ సంస్థను గోయల్, ఆయన సతీమణి రూ.46 కోట్లకు మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది.
దీంతో ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా బుధవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. గోయల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని, కేసు నమోదు చేశారు. ఆయనను పోలీసులు దాదాపు బుధవారం రాత్రంతా విచారించారు. గోయల్‌ను విచారించామని, అతని ఇంటిలో సోదాలు నిర్వహించామని అధికారులు గురువారం వెల్లడించారు.

గత ఏడాది ఆగస్ట్ నెలలో విదేశఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముంబై, ఢిల్లీలోని గోయల్‌కు చెందిన 12 ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో గత ఏడాది ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ సర్వీసులు నిలిపివేసింది. అంతకుముందు మార్చిలో గోయల్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జెట్ ఎయిర్వేస్ నుండి నిధులు మళ్లించినట్లు కార్పోరేట్ వ్యవహారాల శాఖ తన నివేదికలో పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications