వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ ఫ్యాషన్ రిటైలర్ దిగ్గజం మింత్ర కొంతమంది ఉద్యోగులకు షాకిచ్చింది. ఇటీవల ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలు కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. ఈ ఏడాది ఐటీలో భారీగా ఆఫర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా మింత్ర తన ఉద్యోగస్తుల్లో కొంతమందిని తొలగించింది.

80 మంది ఉద్యోగుల తొలగింపు
80 మంది ఉద్యోగస్తులను మింత్ర ఉద్యోగం నుండి తొలగించింది. వీరంతా గురుగ్రామ్ కార్యాలయానికి చెందినవారు. మింత్ర కంపెనీని 2014లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. మరో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ జబాంగ్‌ను మింత్ర ద్వారా 70 మిలియన్ డాలర్లకు 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించారు.

అందుకే తొలగింపు
మింత్ర ఉద్యోగుల్లో ప్రస్తుతం తొలగించిన ఉద్యోగులు 3 శాతంగా (80 మంది) ఉంటుందని అంచనా. గురుగ్రామ్ సెంటర్ నుండి కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు, మెరుగైన సామర్థ్యాలను పెంచేందుకు ఈ ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అయినట్లుగా చెబుతున్నారట.

వివిధ విభాగాల నుండి తొలగింపు
మింత్రలో మొత్తం 3,000 ఉద్యోగులు ఉన్నారు. తొలగింపు తర్వాత గురుగ్రామ్ ఆఫీస్‌లో మాత్రం 165 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలగింపబడిన వారిలో బిజినెస్ ఆపరేషన్స్, ప్రోడక్ట్స్, టెక్నాలజీ, మార్కెటింగ్.. ఇలా వివిధ విభాగాల నుండి ఉన్నారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మింత్ర తన వనరులను ఏకీకృతం చేయడంతో పాటు కార్యకలాపాలను తగ్గించనుందట. గురుగ్రామ్‌లోని ఉద్యోగులు దాదాపు 5 శాతంగా ఉంటారు.

8 నెలల వరకు పూర్తి వేతనం ఇచ్చి తొలగింపు
తొలగించిన ఉద్యోగులకు కంపెన్షేషన్ ప్యాకేజీ, హెల్త్ బెనిఫిట్స్ ప్రయోజనాలు, ఔట్‌ప్లేస్ పర్ఫార్మెన్స్ సేవల యాక్సెస్ అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాదు, కంపన్షేషన్ ప్యాకేజీలో భాగంగా ఆ ఉద్యోగులకు మూడు నెలల నుంచి ఎనిమిది నెలల పూర్తి వేతనం కూడా ఇస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications