దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు ఈ వైరస్ వ్యాక్సీన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. తాజాగా దేశీయ ఫార్మా దిగ్గజం మైలాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్ వర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో దీనిని డెస్రం పేరుతో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 540,764 మంది మృత్యువాత పడగా, ఇందులో మన దేశం నుండి 20,174 ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 11,744,397 కేసులు, దేశంలో 720,346 కేసులు నమోదయ్యాయి.

ధర రూ.4,800
కరోనా బాధితుల అత్యవసర చికిత్స కోసం రెమ్‌డెసివిర్ జనరిక్ ఔషధాన్ని తయారు చేసి, విక్రయించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి మైలాన్ అనుమతి పొందింది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్(వయల్) ధరను రూ.4,800గా(64.31 డాలర్లు) ఉంటుందని తెలిపింది. ఈనెల్లో డెస్రం బ్రాండ్ పేరుతో దీనిని తీసుకొస్తున్నామని పేర్కొంది.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ
వెల్దీ నేషన్స్‌తో పోలిస్తే మైలాన్ వ్యాక్సీన్ ధర 80 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ బ్రాండెడ్ ఔషధాన్ని ప్రభుత్వాలకు విక్రయిస్తున్న దాంతో పోలిస్తే చాలా తక్కువకే దేశీయంగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఔషధ తయారీ, విక్రయాలకు దేశీయంగా సిప్లా(సిప్రెమి), హెటిరో (కోవిఫర్) వంటి సంస్థలు DCGI అనుమతులు పొందాయి. సిప్రెమి ధర రూ.5,000 కాగా, కోవిఫర్ ధర రూ.5,400. విదేశీ ధరలతో పోలిస్తే మనవద్ద అన్ని ధరలు తక్కువే. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారు, ప్రయోగశాలల ద్వారా నిర్ధరాణ అయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఈ ఔషధం వినియోగించవచ్చునని తెలిపింది.

ధనిక దేశాల్లో రూ.2,340 డాలర్లు
కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్ సంస్థ ప్రపంచంలోని 127 అభివృద్ధి చెందుతున్న దేశాలలో రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉంచే ప్రయత్నంలో భాగంగా పలు జనరిక్ ఔషధ తయారీదారులతో లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. గత వారం గిలీడ్ ధనిక దేశాల్లోని రోగికి రెమ్‌డెసివిర్ ధరను 2,340 డాలర్లుగా నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో తమ సరఫరాను అమెరికాకు పంపిస్తామని ప్రకటించింది.

5 రోజుల ట్రీట్మెంట్ కోర్స్.. 6 వయల్స్
ప్రస్తుతం మైలాన్ 100 మిల్లీగ్రాముల వయల్ ధరని 64.31 డాలర్లుగా ప్రకటించింది. అయితే ట్రీట్మెంట్ కోర్సుకు ఎన్ని వయల్స్ అవసరమో తెలియరాలేదు. గిలీడ్ ప్రకారం 5 రోజుల ట్రీట్మెంట్ కోర్స్ కోసం 6 వయల్స్ రెమ్‌డెసివిర్ అవసరం. కరోనా రికవరికీ ఉపయోగపడుతున్న రెమ్‌డెసివిర్ డిమాండ్ పెరిగింది. అయితే సరఫరా గురించి ఆందోళనలు ఉన్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications