మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం లాంగ్‌టర్మ్ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే సులభమైన పెట్టుబడి మార్గం. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు,పెళ్లి లేదా పింఛన్ ప్లాన్ వంటి విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్.
అయితే వారు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి, తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. మైనర్ ఫోలియోలో జాయింట్ హోల్డింగ్ అనుమతించబడదు.

మైనర్ ఫోలియో అంటే ఏమిటి?
మైనర్ ఫోలియో(Minor Folio) అనేది చిన్న వయసులో (18 ఏళ్ల లోపు) ఉన్న వ్యక్తి పేరిట మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేయడానికి తెరిచే ఖాతా లేదా నమోదు(account/record). ఉదాహరణకి మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, వారి పేరిట ఒక మైనర్ ఫోలియో ఓపెన్ చేసి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఈ ప్రక్రియలో మైనర్ పేరు మీద మ్యూచువల్ ఫండ్ ఖాతాను తెరవడం జరుగుతుంది, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చట్టపరమైన సంరక్షకులుగా వ్యవహరిస్తు ఉండాలి.
మైనర్ వారి 18 సంవత్సరాలు చేరుకున్న తర్వాత, వారు కొత్త KYC ఫారమ్ మరియు ఇతర అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతా మార్పిడి ఫార్మాలిటీలను పూర్తి చేయవచ్చు. మైనర్ ఖాతాలోని అన్ని లావాదేవీలను సంరక్షకుడు నిర్వహించాలని గమనించడం ముఖ్యం. పెట్టుబడులు మైనర్ యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం నిర్వహించబడుతున్నాయని నిర్ధారించుకోవడం సంరక్షకుడి బాధ్యత.
ఇటీవల ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ MD & CEO రాధికా గుప్తా గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా మైనర్ ఫోలియో గురించి వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మైనర్‌ల పేరుతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
1. మైనర్‌కి PAN లేకపోయినా ఫోలియో సృష్టించవచ్చా?
అవును. మైనర్‌కి PAN లేకపోయినా ఫోలియో సృష్టించవచ్చు. ఫోలియో ఓపెన్ చేయాలంటే కేవలం గార్డియన్ (తల్లి లేదా తండ్రి/లీగల్ గార్డియన్) PAN మాత్రమే తప్పనిసరి. మైనర్ PAN ఒప్షనల్.
2. మైనర్ ఫోలియో క్రియేషన్‌కు ఏ డాక్యుమెంట్లు అవసరం?
మైనర్‌కి సంబంధించిన గార్డియన్ PAN తప్పనిసరి. అలాగే గార్డియన్-చైల్డ్ మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించే డాక్యుమెంట్లు అవసరం. మైనర్ బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, లేదా కోర్ట్ నియమించిన లీగల్ గార్డియన్ డాక్యుమెంట్.
3. SIPల కోసం గార్డియన్ మరియు మైనర్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించవచ్చా?
SIP లేదా లంప్‌సమ్ పెట్టుబడులకు గార్డియన్ మరియు మైనర్ ఇద్దరి బ్యాంక్ ఖాతాల నుండి ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. అయితే రిడెంప్షన్ (వెనక్కు డబ్బు తీసుకునే ప్రక్రియ) మాత్రం కేవలం మైనర్ బ్యాంక్ ఖాతాకే వెళ్తుంది.
4. మైనర్ ఫోలియో క్రియేట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా మైనర్ ఫోలియో సృష్టించడానికి 2 వ్యాపార రోజులు పడవచ్చు. ఇది గార్డియన్-మైనర్ సంబంధం ధృవీకరణ పత్రం పై ఆధారపడి ఉంటుంది. మొదటి ట్రాన్సాక్షన్ (అంటే మొదటి ఇన్వెస్ట్‌మెంట్) ఫోలియో సృష్టించే సమయంలోనే చేయవచ్చు లేదా తర్వాత కూడా ప్రారంభించవచ్చు.
పిల్లల భవిష్యత్తు కోసం మ్యూచువల్ ఫండ్ లాంటి పెట్టుబడులు చాలా ప్రభావవంతమైనవి. ఒక చిన్న ప్రణాళికతో నేడు పెట్టుబడి పెట్టడం ద్వారా రేపటికి వారికి విద్య, పెళ్లి వంటి ముఖ్య అవసరాలను తేలికగా తీర్చవచ్చు. మైనర్ ఫోలియో తక్కువ సమస్యలతో, సరైన ప్రణాళికతో కొనసాగించవచ్చు.


Click it and Unblock the Notifications