మ్యూచువల్ ఫండ్‌లు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ వాల్యుయేషన్‌లపై విశ్లేషకుల హెచ్చరికలను ధిక్కరించి తమ వాటాలను పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.ఏస్ ఈక్విటీస్ డేటా ప్రకారం డిసెంబర్ 2023 త్రైమాసికంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలలోని దాదాపు 70 శాతం స్టాక్‌ల్లో మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడులు పెట్టాయి.
2023లో నిఫ్టీ మిడ్‌క్యాప్100 సూచీ 46 శాతం పెరగ్గా నిఫ్టీ స్మాల్‌క్యాప్100 సూచీ 55.6 శాతానికి పైగా పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో అవి 14 శాతం, 19 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100లో ఫోర్టిస్ హెల్త్‌కేర్ లో మ్యూచువల్ ఫండ్ల హోల్డింగ్‌లో 6.55 శాతం పెరిగింది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జిలో 5.08 శాతం పెరిగాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా, వోల్టాస్, అపోలో టైర్స్, అరబిందో ఫార్మా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పెట్టుబడులు పెరిగాయి.

నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100లో కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ లో మ్యూచువల్ ఫండ్ వాటా పెరిగింది. త్రైమాసికంలో 3.78 శాతం నుంచి 11.25 శాతానికి పెంచాయి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, గ్రాన్యూల్స్ ఇండియా, కరూర్ వైశ్యా బ్యాంక్, బిఎస్‌ఇ లిమిటెడ్ లో 3 శాతానికి పైగా పెట్టుబడులు పెరిగాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో మ్యూచువల్ ఫండ్ వాటాలు కొనుగోలు చేశాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ సంబంధించి ఫెడరల్ బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, అశోక్ లేలాండ్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్‌లో మ్యూచువల్ ఫండ్లు పెట్టబుడలు తగ్గించాయి. తమ వాటాలను 1 శాతానికి పైగా తగ్గించుకున్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్‌లో MCX MF 4.4 శాతం వాటాను తగ్గించింది. తరువాత సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, నాట్కో ఫార్మా, బిర్లాసాఫ్ట్ వరుసగా 3.4 శాతం, 2.5 శాతం, 2.2 శాతం వాటాను తగ్గించాయి.


Click it and Unblock the Notifications