Success Story: తినడానికి తిండి లేని స్థితి నుంచి 2000 కోట్లకు అధిపతి గా మారాడు ..!
తినడానికి తిండి లేని స్థితి నుంచి రూ.2000 కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతనే బిలియనీర్ ముస్తఫా పీసీ. ముస్తపా పీసీ తండ్రి నెలకు మూడు వందలతో కుటుంబాన్ని పోషించే వాడు. కానీ ముస్తఫా ఇప్పుడు బీలియనీర్ గా మారాడు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చెన్నలోడ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించిన ముస్తఫా తన బాల్యంలో దుర్భర జీవితం గడిపాడు.
అతని తండ్రి దినసరి కూలీ. పేదరికం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న ముస్తఫా తన చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు. డిగ్రీ తర్వాత అతను దుబాయ్‌లోని సిటీ బ్యాంక్‌లో చేరడానికి ముందు ఎలక్ట్రానిక్ వస్తువుల దిగ్గజం మోటరోలాలో కొన్నాళ్లు పనిచేశాడు. తరువాత అతను భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో MBA చదివాడు.

బెంగళూరు ఐఐఎంలో చదువుతున్నప్పుడు ముస్తఫా తన బంధువులతో కలిసి దోసె, ఇడ్లీ పిండి తయారీ కంపెనీని ప్రారంభించాడు. ID ఫ్రెష్ అనే కంపెనీ 2005లో రూ. 50,000 సీడ్ క్యాపిటల్‌తో ప్రారంభించాడు. ఎంబీఏ తర్వాత కంపెనీలో సీఈవోగా చేరారు. ప్రారంభంలో కంపెనీ రోజుకు కేవలం 10 ప్యాకెట్ల పిండిని విక్రయించింది. నేడు, కంపెనీ రూ. 479 కోట్ల వార్షిక లాభంతో హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్ దిగ్గజంగా ఎదిగింది.
ముస్తఫా సరసమైన ధరకు, తాజా, ఇంట్లో తయారు చేసిన & వండడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల పేరు పొందారు. "కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి తాను, తన తోబుట్టువులు ఒక రోజు పాఠశాలకు వెళ్లి మరో రోజు పనికి వెళ్తుండే వాళ్లం. నా పదేళ్ల వయస్సులో తండ్రికి పనిలో సాయం చేశాను" అని ముస్తఫా చెప్పాడు.


Click it and Unblock the Notifications